హరికేన్ మిల్టన్ అలర్ట్.. ఫ్లోరిడా ఖాళీ
సిటీ వదిలి వెళ్లిపోయిన జనం
హరికేన్ మిల్టన్ రావడానికి ముందే అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ప్రభావం ఫ్లోరిడా మీదుగా ఉండటం, 200 కి.మీ.లకు పైగా వేగంతో గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో ఆ సిటీలో నివసించే ప్రజలు జార్జియా, చికాగో తదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. హరికేన్ మిల్టన్ భారీ బీభత్సం సృష్టించబోతుందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఫ్లోరిడాను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. తుపాను హెచ్చరికలతో ఫ్లోరిడాలోని 1,300లకు పైగా ఉన్న పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేశారు. హాస్పిటళ్లు, ఇతర భారీ భవనాల్లోని జనాలను ఖాళీ చేయించారు. మిల్టర్ హరికేన్ తీరం దాటిన 48 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. దీంతో పక్కా భవనాల్లో ఉన్న కొందరు ఇండ్లల్లోనే ఉన్నా బయట అడుగు పెట్టడం లేదు. దీంతో ఫ్లోరిడాలో లాక్ డౌన్ లాంటి వాతావరణం కనిపిస్తోంది.