Telugu Global
International

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం

95 మృతి, మరో 130 మందికి గాయాలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం
X

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం95 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరో 130 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేపలా్‌-టిబెట్‌ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్రస్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బైటికి పరుగులు తీశారు.

ఈ భూకంపం తర్వాత టిబెట్‌ రిజియన్‌లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4,9 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్‌ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.

ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపైనా కనిపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్ర 6.8 గా నమోదైంది.

First Published:  7 Jan 2025 7:49 AM IST
Next Story