Telugu Global
International

పాక్ కు తొలి మహిళా బ్రిగేడియర్‌, చరిత్ర సృష్టించిన క్రైస్తవ మైనారిటీ మహిళ

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మైనారిటీ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు.

పాక్ కు తొలి మహిళా బ్రిగేడియర్‌, చరిత్ర సృష్టించిన క్రైస్తవ మైనారిటీ మహిళ
X

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మైనారిటీ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు. సెలక్షన్ బోర్డ్ ద్వారా బ్రిగేడియర్, ఫుల్ కల్నల్‌గా పదోన్నతి పొందిన పాకిస్తానీ ఆర్మీ అధికారులలో బ్రిగేడియర్ హెలెన్ కూడా ఉన్నారు. పాక్‌ ఆర్మీ మెడికల్‌ కోర్‌లో సీనియర్‌ పాథాలజిస్ట్‌ అయిన మేరీ రాబర్ట్స్ పాక్‌ ఆర్మీలో 1998 నుంచి ప‌నిచేస్తున్నారు. దాదాపు 26 ఏళ్లుగా ఆమె ఆర్మీలో సేవ‌లు అందిస్తున్నారు.

హెలెన్‌కు పదోన్నతి లభించినందుకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభినందనలు తెలిపారు. దేశం మొత్తం ఆమె గురించి గర్విస్తోందని, ఆమె వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వేలాది మంది కష్టపడి పనిచేసే మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పాకిస్తాన్ జనాభాలో 96.47 శాతం ముస్లింలు ఉండగా, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు, 0.09 శాతం అహ్మదీ ముస్లింలు, 0.03 శాతం మంది ఇతరులు ఉన్నారు. ఈ విజయం మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సమాన అవకాశాలు లభించాలనే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయత్నాలకు నాందిగా నిలుస్తుందని అభిప్రాయ పడుటున్నారు.

First Published:  3 Jun 2024 8:19 AM GMT
Next Story