Telugu Global
International

ప‌దవిలో ఉండ‌గానే.. భార్య‌కు విడాకులిచ్చిన ప్ర‌ధాని

2005లో వివాహం చేసుకున్న జ‌స్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగొయి ట్రూడో దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. త‌మ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు బుధ‌వారం వారిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ప‌దవిలో ఉండ‌గానే.. భార్య‌కు విడాకులిచ్చిన ప్ర‌ధాని
X

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో త‌న భార్య‌కు విడాకులిచ్చారు. ప్రధాని పదవిలో కొన‌సాగుతుండ‌గానే భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించిన రెండో ప్రధాని ట్రూడో. మ‌రో విశేష‌మేమిటంటే.. ఆ మొద‌టి వ్య‌క్తి ఆయ‌న తండ్రి పియెర్ ట్రూడోనే. కెన‌డా ప్ర‌ధాన మంత్రి జ‌స్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగొయి ట్రూడో. ఆమె మోడల్‌గా, టీవీ వ్యాఖ్యాతగా అంద‌రికీ సుపరిచితురాలే.

2005లో వివాహం చేసుకున్న జ‌స్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగొయి ట్రూడో దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. త‌మ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు బుధ‌వారం వారిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఇక విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వారు అందులో పేర్కొన్నారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై వారు సంతకాలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

పిల్ల‌ల‌ సంరక్షణను ఇద్దరూ కలిసి చూసుకుంటామని జ‌స్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగొయి తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలో వేరే నివాసంలోకి సోఫీ వెళ్లిపోయారు. పిల్లల్ని చూసుకునేందుకు రిడియా కాటేజీకి వస్తుంటానని, అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడు కూడా పిల్లల్ని చూసుకునేందుకు అక్కడే ఉంటానని ఆమె ప్రకటించారు. ఎప్పటిమాదిరిగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని వారిద్ద‌రూ పేర్కొన్నారు.

First Published:  3 Aug 2023 8:10 AM IST
Next Story