Telugu Global
International

షాకింగ్‌.. ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV

న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV సోకినట్లు తేలింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

షాకింగ్‌.. ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV
X

అందంగా కనిపించేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు క్రీములు, లోషన్లు వాడితే.. ఇంకొందరు రకరకాల కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంటారు. మరికొందరు ఇంజెక్షన్స్‌ సైతం వాడుతుంటారు. ఫెషియల్స్‌లోనూ చాలా రకాలుంటాయి. వీటిలో వాంపైర్ ఫేషియల్ ఒకటి. తాజాగా వాంపైర్ ఫేషియల్ గురించి సంచలన విషయం బయటికొచ్చింది.

వాంపైర్ ఫేషియల్‌తో HIV..

న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV సోకినట్లు తేలింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 2018లో న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని ఓ స్పాలో మహిళలు వాంపైర్ ఫేషియల్‌ చేయించుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేయగా HIV సోకినట్లు తేలింది. ఇందుకోసం US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అన్ని విధాలుగా పరిశోధించింది. అదే స్పాలో వాంపైర్ ఫేషియల్‌ చేసుకున్న 200మందికి పరీక్షలు చేసింది. అయితే వీరిలో ఎవరికీ వ్యాధి సోకలేదని గుర్తించారు.

మహిళలకు HIV ఎలా సోకింది..?

స్పాలో వాంపైర్ ఫేషియల్‌ తీసుకుని HIVకి గురైన ఓ మహిళ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధిత మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని, ఆమె HIV పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధంలో లేదనే నిర్ధారణకు వచ్చారు. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగానే బాధితురాలికి HIV సోకిందని గుర్తించారు. స్పా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఒకరికి వాడిన ఇంజక్షన్లు మరొకరికి వాడటం వల్ల HIV బారిన పడుచున్నారు. HIV సోకిన వ్యక్తి రక్తం మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించడం వల్ల HIV సోకుతుందని అందరకీ తెలిసిందే.

First Published:  28 April 2024 1:20 PM IST
Next Story