Telugu Global
International

అమెరికాలో మరో విమానం మిస్సింగ్‌

అలస్కాలో కనిపించకుండా పోయిన విమానం

అమెరికాలో మరో విమానం మిస్సింగ్‌
X

అమెరికాలో మరో విమానం కనిపించకుండా పోయింది. అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న సెస్నా 208బీ గ్రాండ్‌ కారవాన్‌ విమానం కనిపించకుండా పోయిందని అలస్కా పబ్లిక్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఈ విమానంలో పది మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో ఈ విమానం జాడ తెలియకుండా పోయిందని వెల్లడించింది. వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియా లో విమానం కూలిపోయి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనను మరిచిపోకముందే మరో విమానం గల్లంతు కావడంతో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు.

First Published:  7 Feb 2025 12:00 PM IST
Next Story