Telugu Global
International

ఇంటి నుంచి పారిపోయి వచ్చి.. 80 ఏళ్ల వృద్ధుడితో 23ఏళ్ల యువతి పెళ్లి

అమ్మాయి వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. తాత వయసులో ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకుంటావా అంటూ సీరియస్ అయ్యారు. వృద్ధుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతి అతనితోనే బతకాలని నిర్ణయించుకుంది.

ఇంటి నుంచి పారిపోయి వచ్చి.. 80 ఏళ్ల వృద్ధుడితో 23ఏళ్ల యువతి పెళ్లి
X

ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. ప్రేమకు కులం, మతం, పేద, ధనిక, వయసు అనే భేదాలు ఉండవు. తమకంటే 20 నుంచి 30 ఏళ్లు పెద్ద వయసున్నవాళ్లని పెళ్లిచేసుకుంటున్న ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయి. తాజాగా చైనాలోనూ ఇలాంటిదే జరిగింది. ఈ ప్రేమకథ హెబీ ప్రావిన్స్‌లో మొదలైంది. వృద్ధాశ్రమంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల అమ్మాయికి 80 ఏళ్ల వృద్ధుడికి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంట్రెస్టులు కలవడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాల 57 ఏళ్లు. కొన్నినెలలు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అమ్మాయి వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. తాత వయసులో ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకుంటావా అంటూ సీరియస్ అయ్యారు. వృద్ధుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతి అతనితోనే బతకాలని నిర్ణయించుకుంది. పెళ్లికోసం తల్లిదండ్రుల్నే వదులుకుంది. ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి వృద్ధుడ్ని పెళ్లిచేసుకుంది. వృద్ధుడి మెచురిటీకి ఫ్లాట్ అయ్యానని యువతి చెప్పగా.. అమ్మాయి అందానికి ముగ్ధుడిని అయ్యానని వృద్ధుడు తెలిపాడు. ఇపుడీ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముసలోడికి దసరా పండగ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుందని ఇంకొందరు అంటున్నారు.

First Published:  14 Jun 2024 8:00 AM GMT
Next Story