వృత్తికే కళంకం తెచ్చేలా.. మహిళా టీచర్ల తీరు
రెండు రోజుల వ్యవధిలో వేర్వురు ప్రాంతాల్లోని ఆరుగురు మహిళా టీచర్లు ఇలాంటి వ్యవహారాల్లో అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో ఆరుగురు మహిళా టీచర్లు వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వీరు.. తమ పాఠశాలలోని మైనర్ విద్యార్థులతో లైంగిక కార్యకలాపాలు నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలో వేర్వురు ప్రాంతాల్లోని ఆరుగురు మహిళా టీచర్లు ఇలాంటి వ్యవహారాల్లో అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాలిఫోర్నియాలోని దానివిల్లే పట్టణానికి చెందిన ఎలెన్ షెల్ (38) స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ.. పాఠశాలలోని ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆర్కన్సాస్ రాష్ట్రానికి చెందిన హెథర్ హరే (32) అనే మహిళా టీచర్ కూడా మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్టు ఆమెపై కేసు నమోదైంది. ఒక్లహామాకు చెందిన ఎమిలీ హాన్‌కాక్ (26), లిన్ కాల్న్ కౌంటీలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఎమ్మా డిలానె, అయోవా రాష్ట్రంలోని దేస్ మొయిన్స్‌లో ఉన్న ఓ హైస్కూల్‌లో క్రిస్టెన్ గ్యాంట్ అనే ఇంగ్లిష్ టీచర్.. కూడా టీనేజీ విద్యార్థులతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
వర్జీనియాలోని హైస్కూల్‌లోనూ ఒక మహిళా టీచర్ (33) ఓ విద్యార్థితో చాలా కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తోందని ఆరోపణల నేపథ్యంలో ఆమె పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వీరితో పాటు పెన్సిల్వేనియాలోని జావెలిన్ కోచ్‌ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో మహిళా టీచర్లు మైనర్లు అయిన విద్యార్థులతో కొనసాగిస్తున్న లైంగిక సంబంధాల వ్యవహారాలు ఇప్పుడు అక్కడ ఆందోళనకరంగా మారాయి. ఈ వ్యవహారాలన్నీ రెండు రోజుల వ్యవధిలోనే బయటపడటం సంచలనంగా మారింది.