Telugu Global
Telangana

అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమి వేలం వేస్తాం

దళిత రైతులపై రేవంత్‌ సర్కార్‌ దౌర్జన్యం

అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమి వేలం వేస్తాం
X

రుణమాఫీ బూటకమని మరోసారి తేలింది. ప్రభుత్వం చెబుతున్న రూ. 2 లక్షల రుణమాఫీ ఉత్తముచ్చటేనని తేలింది. ఇదే విషయాన్ని రైతులు, ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కొట్టిపారేసింది. కానీ మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు తీసుకున్న 1.25 లక్షలు (అప్పు, వడ్డీ కలిపి) కాలేదు. అప్పుకట్టాలని ఆ రైతుకు డీసీసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ రైతు వాపోయాడు.

వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా నర్సింహుల పేట మండలం జయంపురంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మందుల యాకన్న అనే రైతు తీసుకున్న అప్పు అసలు వడ్డీ కలిపి రూ.1.25 లక్షల వరకు ఉన్నది. ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుబుతున్నది. కానీ తనకు ఎలాంటి రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం రైతుబంధు ఇవ్వక పెట్టుబడి కోసం చేసిన అప్పులే ఇంకా తీర్చలేకపోతున్నాం. బ్యాంకు రుణాలు ఎలా చెల్లించాలంటూ ఆ యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు అప్పుకట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తామని బ్యాంకు యాజమాన్యాలు నోటీసులు ఇస్తున్నదని చెప్పాడు. నర్సింహులపేట మండలంలో సుమారు 20 మంది రైతులకు బ్యాంకు నోటీసులు వచ్చాయి. ఒకవైపు నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు బ్యాంకులు నోటీసులతో బెదిరిస్తే తాము ఎలా బతకాలి అంటూ రైతులు వాపోతున్నారు. దళిత రైతులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమది బడుగులు బలహీన వర్గాల ప్రభుత్వం అని, తమది ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌ సర్కార్‌ ఈ పదిహేను నెలల కాలంలో ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదు. నిన్నగాక మొన్న గవర్నర్‌ ప్రసంగంలో, అంతకుముందు చాలాసార్లు రేవంత్‌ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని గొప్పలు చెప్పుకున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తీసుకున్న అప్పు కట్టాలని రైతులకు బ్యాంకు యాజమాన్యాలు నోటీసులు ఇస్తున్నాయి. అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తామని బెదిరిస్తున్నాయి.

బ్యాంకులు ఇచ్చిన నోటీసులు





First Published:  14 March 2025 11:38 AM IST
Next Story