Telugu Global
NEWS

చల్లని మాన్‌సూన్‌లో హాట్ హాట్ సూప్స్..!

సూప్స్‌లో ట‌మాటా సూప్.. రారాజు. అయితే కేవలం ట‌మాటాలతోనే కాకుండా రీఫ్రెష్‌మెంట్ కోసం అందులో కొద్దిగా తులసి ఆకులు కలిపితే సూప్‌కు కొత్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది.

చల్లని మాన్‌సూన్‌లో హాట్ హాట్ సూప్స్..!
X

వర్షాకాలంలో బయట చల్లని జల్లులు కురుస్తుంటే నోటికి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని జంక్ ఫుడ్ తినకుండా శరీరానికి హాయినిచ్చే వేడి వేడి సూప్స్ తాగితే శరీరంతో పాటు మనసుకూ ఎంతో ఉపశమనం లభిస్తుంది. మాన్‌సూన్‌లో ఏయే సూప్స్ మేలు చేస్తాయంటే..

సూప్స్‌లో ట‌మాటా సూప్.. రారాజు. అయితే కేవలం ట‌మాటాలతోనే కాకుండా రీఫ్రెష్‌మెంట్ కోసం అందులో కొద్దిగా తులసి ఆకులు కలిపితే సూప్‌కు కొత్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ట‌మాటా రసాన్ని వేడి చేసి అందులో తులసి ఆకుల పేస్ట్ వేసి సూప్‌లా తయారుచేయాలి. సువాసన భరితంగా ఉండే ఈ సూప్ సాయంత్రం వేళల్లో తీసుకోవ‌డానికి బాగుంటుంది. ట‌మాటాలోని విటమిన్ సీ, తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు బాడీని యాక్టివేట్ చేస్తాయి.

కొరియాండర్ సూప్

కొత్తిమీర, నిమ్మ రసంతో చేసే సూప్‌ను కోరియాండర్ సూప్ లేదా ట్యాంగీ సూప్ అంటారు. నీళ్లలో కొత్తిమీర పేస్ట్‌ వేసి అందులో ఉప్పు, జీలకర్ర, సుగంధ ద్రవ్యాలు వంటివి వేసి మరిగించాలి. చివరిగా దింపేముందు నిమ్మరసాన్ని కలపాలి. వర్షాకాలంలో వచ్చే జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను ఇది తగ్గిస్తుంది. సువాసనభరితమైన ఈ సూప్ ఎంతో రీఫ్రెష్‌మెంట్‌ ఫీలింగ్‌ని ఇస్తుంది.

మష్రూమ్ సూప్

పుట్టగొడుగులు, వెల్లుల్లితో చేసే మష్రూమ్ సూప్.. ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడుతుంది. వెల్లుల్లి.. వర్షాకాలం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మష్రూమ్స్‌ను ఉడికించిన నీటిలో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వంటివి వేసి సూప్ రెడీ చేయాలి. ఈ సూప్ సువాసనభరితంగా ఉంటూనే మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది.

క్యారెట్ సూప్

లేత క్యారెట్‌లను తీసుకుని వాటిని బాగా ఉడికించి సూప్‌గా తయారు చేయాలి. ఇందులో మిరియాలు, జీలకర్ర వంటివి వేసి తగినంత ఉప్పు వేస్తే.. క్యారెట్ సూప్ రెడీ. ఇది వర్షాకాలం చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

స్వీట్‌కార్న్ సూప్

స్వీట్‌కార్న్ సూప్‌ను ఇష్టపడని వాళ్లుండరు. ఆలుగడ్డలను పేస్ట్‌లా చేసి నీళ్లు కలిపి సూప్‌లా రెడీ చేసుకోవాలి. అందులో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను కలిపితే చిక్కటి సూప్ రెడీ అవుతుంది. పిల్లలు ఈ సూప్‌ను ఇష్టంగా తీసుకుంటారు.

First Published:  18 July 2023 2:19 PM IST
Next Story