Telugu Global
NEWS

ఇండస్ట్రీకి గొప్ప పాఠం 'హనుమాన్'

తెలుగు ఇండస్ట్రీకి ప్రశాంత్ గొప్ప పాఠాన్ని నేర్పించాడని వర్మ కొనియాడాడు. లో బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయాలంటే తెలివి ఉండాలని, సమగ్రత, పట్టుదల, శ్రమ ఉంటే ఇది సాధ్యమవుతుందని ప్రశాంత్ వర్మ నిరూపించాడన్నారు.

ఇండస్ట్రీకి గొప్ప పాఠం హనుమాన్
X

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తీసిన ప్రశాంత్ వర్మను తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రశంసించాడు. లో బడ్జెట్ తో కూడా ఇంత అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సినిమాలు తీయొచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించాడని అభినందించాడు. ఇటువంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు తీయాలంటే వందల కోట్లు కావాలని భావించే వారికి చెంపదెబ్బలా హనుమాన్ మూవీని తీశాడని అన్నారు.

ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రశాంత్ గొప్ప పాఠాన్ని నేర్పించాడని వర్మ కొనియాడాడు. లో బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయాలంటే తెలివి ఉండాలని, సమగ్రత, పట్టుదల, శ్రమ ఉంటే ఇది సాధ్యమవుతుందని ప్రశాంత్ వర్మ నిరూపించాడన్నారు.

హనుమాన్ సక్సెస్ అయినందుకు మాత్రమే కాకుండా.. ఎంతోమందికి మంచి పాఠాన్ని నేర్పినందుకు ప్రశాంత్ ను అభినందిస్తున్నానని వర్మ చెప్పాడు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాల మధ్య విడుదలైన హనుమాన్ ఊహించని విధంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హనుమాన్ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.

First Published:  14 Jan 2024 6:52 PM IST
Next Story