Telugu Global
NEWS

5.6 సెక‌న్ల‌లో 100 కి.మీ స్పీడ్ అందుకునే కొత్త కారు ఈనెల 28న భార‌త్ మార్కెట్‌లోకి..

BMW iX1 EV SUV | బీఎండ‌బ్ల్యూ ఎంట్రీ లెవ‌ల్ ఎక్స్‌1 (X1) ఎస్‌యూవీల్లో బీఎండ‌బ్ల్యూ ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ వ‌ర్ష‌న్ కారు. ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్ (xDrive30 variant)గా మార్కెట్లోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

5.6 సెక‌న్ల‌లో 100 కి.మీ స్పీడ్ అందుకునే కొత్త కారు ఈనెల 28న భార‌త్ మార్కెట్‌లోకి..
X

BMW iX1 EV SUV | జ‌ర్మ‌నీ కార్ల త‌యారీ సంస్థ బీఎండ‌బ్ల్యూ (BMW) భార‌త్ మార్కెట్‌లోకి త‌న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ.. ఐఎక్స్‌1 (iX1) ఆవిష్క‌రించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 28న ఐఎక్స్‌1 (iX1) కారును భార‌త్ మార్కెట్లోకి తేనుంది. దీంతో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన నాలుగో ఈవీ కారుగా ఇది నిలుస్తుంది. బీఎండ‌బ్ల్యూ ఎంట్రీ లెవెల్ ఎక్స్‌1 ఎస్‌యూవీ థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్ ఆధారంగా రూపుదిద్దుకున్న‌దే ఐఎక్స్‌1 (iX1). భార‌త్ మార్కెట్లో బీఎండ‌బ్ల్యూ ఆవిష్క‌రించిన ఇత‌ర ఎస్‌యూవీ కార్ల‌కు దిగువ‌న ఉంటుందీ ఐఎక్స్1. ఈ ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ కారు ధ‌ర రూ.70 ల‌క్ష (ఎక్స్ షోరూమ్) ల్లోపే ఉంటుంద‌ని భావిస్తున్నారు. ల‌గ్జ‌రీ ఈవీ కార్ల సెగ్మెంట్‌లో వోల్వో సీ40 రీచార్జీ (Volvo C40 Recharge), కియా ఈవీ6 త‌దిత‌ర కార్ల‌తో ఐఎక్స్‌1 (iX1) పోటీ పడుతుంది.

బీఎండ‌బ్ల్యూ ఎంట్రీ లెవ‌ల్ ఎక్స్‌1 (X1) ఎస్‌యూవీల్లో బీఎండ‌బ్ల్యూ ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ వ‌ర్ష‌న్ కారు. ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్ (xDrive30 variant)గా మార్కెట్లోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఈ డ్రైవ్ 20, ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్ల‌లోనూ రావ‌చ్చున‌ని భావిస్తున్నారు. ఈ డ్రైవ‌ర్ 20 వేరియంట్ సింగిల్ ఎల‌క్ట్రిక్ మోటార్‌, ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్‌ డ్యుయ‌ల్ ఎల‌క్ట్రిక్ మోటార్ సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ఎల‌క్ట్రిక్ మోటార్ గ‌రిష్టంగా 313 బీహెచ్పీ విద్యుత్‌, 494 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. ఆల్ ఫోర్ వీల్స్‌పై ఎల‌క్ట్రిక్ మోటార్లు ప‌వ‌ర్ ఆఫ‌ర్ చేస్తాయి. కేవ‌లం 5.6 సెకన్ల‌లో 100 కి.మీ స్పీడ్ అందుకోగ‌ల సామ‌ర్థ్యం గ‌ల ఈ కారు గ‌రిష్టంగా గంట‌కు 180 కి.మీ వేగంతో ప్ర‌యాణిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 475 కి.మీ దూరం ప్ర‌యాణించ గ‌ల కెపాసిటీ దీని సొంతం. రెండు వేరియంట్లు కూడా 64.7 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తున్నాయి.

బీఎండ‌బ్ల్యూ ఐఎక్స్‌1 కారు.. స్వ‌ల్ప మార్పులు మిన‌హా ఐసీఈ ఎక్స్‌1ను పోలి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఫ్రంట్ ఫేషియా విత్ బీఎండ‌బ్ల్యూ కిడ్నీ గ్రిల్లె, రీ డిజైన్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌, రీవ‌ర్క్‌డ్ లోయ‌ర్ బంప‌ర్ విత్ క్రోమ్ అసెంట్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఎయిరో డైన‌మిక‌ల్లీ డిజైన్ చేసిన మ‌ల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తోపాటు ఎల్‌-షేప్డ్ టెయిల్ గేట్స్‌, క్రోమ్ అసెంట్స్‌, ఇంటిగ్రేటెడ్ స్పాయిల‌ర్ విత్ స్కిడ్ ప్లేట్స్ వంటి ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

రెగ్యుల‌ర్ ఎక్స్‌1 మ‌దిరిగా ఐఎక్స్‌1 డాష్ బోర్డ్ లేఔట్ పొందుతుంది. డ్యుయ‌ల్ 10.7 అంగుళాల స్క్రీన్స్ ఫ‌ర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, డ్యుయ‌ల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌, ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, క‌నెక్టెడ్ కార్ టెక్‌, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో త‌దిత‌ర ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం మ‌ల్టీఫుల్ ఎయిర్ బ్యాగ్స్‌, టీసీఎస్‌, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్స్‌, ఏబీఎస్‌, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్‌, పార్క్ అసిస్ట్ త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశారు.

First Published:  25 Sept 2023 2:24 PM IST
Next Story