ఆర్ఆర్ఆర్ కు బిగ్ షాక్ : ఇండియా నుంచి ఆస్కార్ కు 'చల్ షో'
పలువురు హాలీవుడ్ దర్శకనిర్మాతలు, రచయితలు ఆర్ఆర్ఆర్ అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు. దీంతో ఈ సినిమాకు ఈసారి ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అంతా భావించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయం అంటూ కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే అందరికీ షాక్ ఇస్తూ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్స్ కు పంపేందుకు చల్ షో అనే గుజరాతీ సినిమాను ఎంపిక చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1200కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన తర్వాత వివిధ దేశాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. పలువురు హాలీవుడ్ దర్శకనిర్మాతలు, రచయితలు ఆర్ఆర్ఆర్ అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు. దీంతో ఈ సినిమాకు ఈసారి ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అంతా భావించారు.
హాలీవుడ్ లో ప్రముఖ మ్యాగజైన్ అయిన వెరైటీ ఆస్కార్ అవార్డు రేసులో ఆర్ఆర్ఆర్ సినిమా ఉన్నట్లు ఒక కథనంలో ప్రచురించింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, చరణ్ ఆస్కార్ అవార్డు రేసులో నిలవడం ఖాయమని ఆ మ్యాగజైన్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాకు ఏదో ఒక విభాగంలో ఈసారి అవార్డు రావడం పక్కా అని ప్రేక్షకులు భావించారు.
అలాగే బాలీవుడ్ మూవీ కశ్మీర్ ఫైల్స్ కూడా ఆస్కార్ అవార్డు రేసులో ఉందని ప్రచారం జరిగింది. కాగా ఇవాళ ఆస్కార్ నామినేషన్లు పంపడంపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశమైంది. పలు సినిమాలను పరిశీలించిన తర్వాత గుజరాతీ సినిమా `చల్ షో`ను ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక చేసింది. ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలను కాదని `చల్ షో` ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కావడంపై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాన్ నళిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చల్ షో సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.