లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్
సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీలో మూడు రోజుల పాటు విచారించినట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్‌లోని 12 కంపెనీలతో పాటు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకూ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసింది. వారిలో అరబిందో కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉన్న పెనాక శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మరొకరు లిక్కర్ వ్యాపారి వినయ్ బాబు. వీరిని అరెస్ట్ చేసినట్టు ఈడీ ప్రకటించింది.
సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీలో మూడు రోజుల పాటు విచారించినట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్‌లోని 12 కంపెనీలతో పాటు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకూ డైరెక్టర్‌గా ఉన్నారు.
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన రెండు కంపెనీలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాయి. వీటికి అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచే బ్యాంకు గ్యారెంటీలు ఉన్నట్టుగా ఈడీ, సీబీఐ గుర్తించాయి. దాంతో ఎఫ్‌ఐఆర్‌లో శరత్ చంద్రారెడ్డి పేరును చేర్చారు. ఇప్పుడు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబును ఈడీ అరెస్ట్ చేసింది.