Telugu Global
NEWS

ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై వచ్చిన పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం పార్టీ సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంతవరకు సీఎం పదవిలో ఉండనని వెల్లడించారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు తమతో ఉండి నడిపించినట్టు కేజ్రీవాల్ అన్నారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు.

ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను మహారాష్ర్టతో పాటు నవంబర్ లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కోర్టులో న్యాయం దొరికిందని.. ఇక ప్రజా కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు నమ్మితే ఓట్టు వేయాలని కోరారు. ఇక ప్రజలే అంతిమ నిర్ణేతలని కేజ్రీవాల్ అన్నారు.

మరోవైపు కేజ్రీవాల్ నేపథ్యంలో ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని.. అది ఎవరనే విషయం రెండు , మూడు రోజుల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను జైల్లో పెట్టి ఆప్ లో చీలికలు తేవాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు. జైల్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇన్ని రోజులు రాజీనామా చేయలేదని తెలిపారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులను బీజేపీ కొత్త గేమ్స్ ఆడుతోందని విమర్శించారు. అందులో భాగంగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం విజయన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కేసులు పెట్టారన్నారు. వాళ్లందరికీ విజ్ఞప్తి ఏంటంటే.. కేసులు నమోదు చేస్తే రాజీనామాలు చేయోద్దని కేజ్రీవాల్ సూచించారు.

మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

First Published:  15 Sept 2024 6:30 PM IST
Next Story