Telugu Global
NEWS

హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు చేశారు.

మా ప్రశ్న రాకుండా ముందు ప్రశ్నలను సాగదీశారని, మా గొంతునొక్కుతున్నారని మండిపడిన హరీశ్‌

హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు చేశారు.
X

శాసనసభలో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ..నిన్న అజెండాలో రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. రైతు భరోసా వానకాలం వేశారా? లేదా? రూ. 15 వేలు ఎప్పటి నుంచి అనే ప్రశ్న ఉండేనన్నారు.హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు చేశారు. టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ. 10 వేల కోట్ల అప్పు తీసుకున్నారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 10 వేల కోట్ల చొప్పున అప్పులుచేశారు. మా ప్రశ్న రాకుండా ముందు ప్రశ్నలను సాగదీశారని, మా గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై నిన్న సభాపతికి ఫిర్యాదు చేశాను. ప్రభుత్వ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో పెట్టలేదన్న ఎంఐఎం ప్రశ్నరాకుండా చేశారు. ప్రాజెక్టుల కింద పంట ఎండితే తమది బాధ్యత అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెబుతున్నారు. గోదావరి, కృష్ణ కింద పంటలు ఎండుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. అలాగే వడ్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వడ్ల కొనుగోలు కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట పండిందని ప్రభుత్వం చెప్పింది.. 52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వానకాంలో 70 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నవిషయాన్ని గుర్తు చేశారు. పంట కొనుగోళ్ల విషక్ష్మీంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 54 లోల మెట్రిక్‌ సన్నాలు కొంటామన్నారు. కానీ కొన్నది 24 లక్షల మెట్రిక్‌ టన్నులేనని హరీశ్‌ చెప్పారు.పంట చేతికి వస్తున్నా రైతులకు పెట్టుబడి సాయం రావడం లేదన్నారు. వీటన్నింటికి సమాధానాలు చెప్పలేకనే ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేక ప్రభుత్వం పారిపోతున్నదని హరీశ్‌ అన్నారు.

రూ. 1.5 లక్షల కోట్ల అప్పులు చేశారు.. హామీలు విస్మరించారు

మండలిలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని వివిధ హామీలపై నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీల అమలు ఊసే లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తులం బంగారం ఇవ్వబోమని మండలి సాక్షిగా మంత్రి చెప్పారు. ఆడపిల్లలకు స్కూటీలు ఎగొట్టే పని చేస్తున్నారు. రూ. 1.5 లక్షల కోట్ల అప్పులు చేశారు.. హామీలు విస్మరించారని కవిత విమర్శించారు.

మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్‌ నైజం

ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్‌ నైజం అని ధ్వజమెత్తారు. అన్నివర్గాలను వంచించినట్లు విద్యార్థులను మోసం చేశారు. హామీలు అమలు చేయలేమని ఘన్‌ఫూర్‌ సభలో సీఎం చేతులెత్తారు. హామీలు అమలు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ మళ్లీ సమస్యలకు నిలయంగా మారుతున్నదన్నారు.

First Published:  18 March 2025 12:25 PM IST
Next Story