Telugu Global
Health & Life Style

చలికాలం చర్మం పాడవ్వకుండా..

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సాయత్రం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి మార్పులు వచ్చినప్పుడు చర్మం పొడిబారి, పగిలిపోతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలం చర్మం పాడవ్వకుండా..
X

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సాయత్రం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి మార్పులు వచ్చినప్పుడు చర్మం పొడిబారి, పగిలిపోతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

చలికాలం చర్మం పగిలిపోకుండా ఉండేందుకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. అలాగే స్నానానికి వెళ్లే ముందు చర్మానికి నూనె రాసుకోవడం ద్వారా చర్మంలోని తేమ పోకుండా ఉంటుంది.

చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్ కచ్చితంగా రాసుకోవాలి. చాలామంది సన్‌క్రీమ్ ఎండాకాలం మాత్రమే వాడాలనుకుంటారు. కానీ చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు సన్‌క్రీమ్ కూడా బాగా పనిచేస్తుంది.

చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. అందుకే తెలియకుండానే నీళ్లు తాగడాన్ని తగ్గిస్తుంటారు చాలామంది. కానీ హైడ్రేటెడ్‌గా ఉండకపోతే ఆ ఎఫెక్ట్ చర్మంపై పడుతుంది. చర్మం తాజాగా ఉండాలంటే ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండడం అవసరం.

చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం పోషకాలు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటుండాలి.

ఇక వీటితోపాటు చలికాలం వ్యాయామం చేయడం మర్చిపోకూడదు. వ్యాయామం వల్ల చర్మానికి చెమట పడుతుంది. చెమట ద్వారా టాక్సిన్స్ బయటకు పోతాయి. అలాగే వ్యాయామం ద్వారా చర్మానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది.

First Published:  27 Oct 2022 4:17 PM IST
Next Story