చలికాలం చర్మం తాజాగా ఉండాలంటే..
Winter Skin care tips in Telugu: చలికాలంలో అందరినీ వేధించే సమస్యల్లో ముఖ్యమైనది చర్మం పొడిబారడం. రోజువారీ అలవాట్లలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత త్వరగా పొడిబారిపోతుంది.
చలికాలంలో అందరినీ వేధించే సమస్యల్లో ముఖ్యమైనది చర్మం పొడిబారడం. రోజువారీ అలవాట్లలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత త్వరగా పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం కోసం కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే..
చలికాలంలో వేడినీటి స్నానం చేస్తుంటారు చాలామంది. అయితే మరీ వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పాడవుతుంది. వేడికి చర్మంలోని తేమ, నూనెలు తొలగిపోతాయి. అందుకే స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
చలికాలం స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మాన్ని తేమగాఉంచుకోవచ్చు. అలాగే చలికాలం మేకప్ ను తక్కువగా వాడితే చర్మం తాజాగా ఉంటుంది.
చలికాలం వీలైనంత వరకూ తాజాగా, అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సీజన్ లో చల్లబడిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించడం శరీరానికి కష్టమవుతుంది. తాజా ఆహారం తీసుకుంటే చర్మం కూడా తాజాగా ఉంటుంది.
చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. అందుకే చాలామంది మంచినీళ్లు తాగడం మర్చిపోతుంటారు. అయితే దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
ఇకపోతే చలికాలం చర్మం చలిగాలికి ఎక్స్ పోజ్ అవ్వకుండా ఫుల్ స్లీవ్స్ లాంటివి వేసుకోవాలి. తద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.