మీకు కొలెస్ట్రాల్ పెరుగుతోందా? ఇలా చెక్ చేసుకోండి!
ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న సడెన్ హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివాటికి కొలెస్ట్రాల్ ముఖ్య కారణంగా ఉంటోంది. అయితే చాలామందికి తమలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందన్న సంగతి తెలియదు. అసలు కొలెస్ట్రాల్ ను ఎలా గుర్తించాలంటే.
ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న సడెన్ హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివాటికి కొలెస్ట్రాల్ ముఖ్య కారణంగా ఉంటోంది. అయితే చాలామందికి తమలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందన్న సంగతి తెలియదు. అసలు కొలెస్ట్రాల్ ను ఎలా గుర్తించాలంటే..
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు కొన్ని చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు. ఆ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ మితిమీరకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే..
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతున్నప్పుడు తరచూ చెమటలు పడుతుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా చెమటలు పట్టడం ఎక్కువవుతుంటే మీలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందేమో చెక్ చేసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. మీలో కొత్తగా ఉబ్బసం, శ్వాసలో ఇబ్బందుల వంటివి గమనిస్తే అది కొలెస్ట్రాల్ లక్షణం అయ్యి ఉండవచ్చు. అలాగే ఛాతిలో నొప్పి కూడా కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందిలో చిగుళ్ల సమస్యలు కూడా రావొచ్చు. చిగుళ్ల సమస్యలు, దంతాల నొప్పి వంటివి తరచూ వస్తుంటే ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగినప్పుడు మజిల్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. కొద్దిపాటి శారీరక శ్రమకే నొప్పులు వేధిస్తుంటే అది కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాలి.
ఇక వీటితోపాటు ఊరికే అలసిపోవడం, మగతగా అనిపించడం, తిమ్మిర్లు పట్టడం వంటివి కూడా కొలెస్ట్రాల్ లక్షణాలే. కాబట్టి ఇలాంటి లక్షణాలను గమనించినప్పుడు ఒకసారి డాక్టర్‌ను కలిసి లిపిడ్ ప్రొఫైల్ వంటి కొలెస్ట్రాల్ పరిక్షలు చేయించుకోవడం మంచిది.
కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవడం కోసం జంక్ ఫుడ్ మానేసి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. రోజువారీ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి మానేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి.