చలికాలంలో తలనొప్పి వేధించకుండా జాగ్రత్తలు!
తలనొప్పి అనేది చాలామందిని వేధించే సమస్య. తలలో కలిగే విపరీతమైన నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే తలనొప్పికి సంబంధించిన సమస్యలు మిగతా సీజన్ల కంటే చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి.
తలనొప్పి అనేది చాలామందిని వేధించే సమస్య. తలలో కలిగే విపరీతమైన నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే తలనొప్పికి సంబంధించిన సమస్యలు మిగతా సీజన్ల కంటే చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. మరి ఈ సీజన్‌లో తలనొప్పి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
తలనొప్పిలో చాలారకాలుంటాయి. ఒక్కోరకమైన తలనొప్పికి ఒక్కోరకమైన కారణముంటుంది. అయితే చలికాలంలో వాతావరణంలోని బారోమెట్రిక్ ప్రెజర్‌లో వచ్చే మార్పు కారణంగా లేదా మెదడులోని నాళాల్లో సంకోచం ఏర్పడడం వల్ల చలామందిలో మైగ్రేన్ తలనొప్పి ఎక్కువవుతుందని డాక్టర్లు చెప్తున్నారు.
మైగ్రేన్ వంటి తలనొప్పి మొదలైందంటే.. శబ్దాలు వింటే భరించలేరు. కాంతి చూడలేరు. వాంతులు అవుతుంటాయి. మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది. ఈ తలనొప్పిని భరించడం చాలా కష్టం. అందుకే ఈ తరహా తలనొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
వాతావరణంలోని హెచ్చు తగ్గుల కారణంగా, చల్లగాలుల కారణంగా తలనొప్పి మొదలవ్వొచ్చు. కాబట్టి ఈ సీజన్‌లో చల్లని గాలులకు ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. శరీరాన్ని కప్పి ఉంచే బట్టలు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా కూడా ఉంచుకోవాలి.
చాక్లెట్లు, కెఫెన్, ఆల్కహాల్ వంటి పదార్థాలు తలనొప్పికి ట్రిగ్గర్ పాయింట్స్ వంటివి. కాబట్టి ఈ సీజన్‌లో వీటికి దూరంగా ఉంటే మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు, ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ వంటివి మైగ్రేన్‌ను ఎక్కువ చేస్తాయి. కాబట్టి వీటిని కూడా తగ్గిస్తే మంచిది.
హ్యుమిడిఫైయర్‌ల వంటివాటిని ఉపయోగించడం ద్వారా ఇంట్లో తేమ లేకుండా చూసుకోవచ్చు. రూమ్ హీటర్ల వంటివి కూడా వాడొచ్చు.
రాత్రిళ్లు మంచిగా నిద్రపోవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో నిద్రను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ల లోపాలు లేకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్‌లో చేపలు, గుడ్లు, కాయగూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్–డి లోపం రాకుండా చూసుకోవాలి.
ఇక వీటితోపాటు రోజూ కొంతసేపు తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటివి చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తలనొప్పి సమస్య రాకుండా ఉంటుంది.