Telugu Global
Health & Life Style

గూస్ బంప్స్ ఎందుకు వస్తాయంటే..

సాధారణంగా చ‌ర్మంమీద ఉండే ప్రతి వెంట్రుకను సపోర్ట్‌ చేసేందుకు 'ఎర‌క్టర్ పిలి' అనే ఒక కండ‌రం ఉంటుంది. ఈ కండ‌రాలు సంకోచించిన‌ప్పుడు అక్కడి చ‌ర్మం ద‌గ్గర‌కు వ‌చ్చి వెంట్రుక‌లు పైకి లేస్తాయి.

గూస్ బంప్స్ ఎందుకు వస్తాయంటే..
X

సినిమాలు చూసేటప్పుడు , ఎప్పుడైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు, ఉన్నట్టుండి ఆశ్చర్యానికి, భయానికి లోనైనప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీన్నే గూస్ బంప్స్ అంటుంటాం. అసలు ఈ గూస్ బంప్స్ ఎలా వస్తాయో తెలుసా?

సాధారణంగా చ‌ర్మంమీద ఉండే ప్రతి వెంట్రుకను సపోర్ట్‌ చేసేందుకు 'ఎర‌క్టర్ పిలి' అనే ఒక కండ‌రం ఉంటుంది. ఈ కండ‌రాలు సంకోచించిన‌ప్పుడు అక్కడి చ‌ర్మం ద‌గ్గర‌కు వ‌చ్చి వెంట్రుక‌లు పైకి లేస్తాయి. మెదడులో కణాలు.. బయట జరిగిన విషయం వల్ల షాక్‌కు గురైనప్పుడు ఇలా జరుగుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మెదడు శరీరాన్ని ఒక్క ఉదుటున అప్రమత్తం చేయాలనుకుంటుంది. అప్పుడు రక్తం వేగం పెరిగి చర్మం కండరాలు బిగుసుకుంటాయి.

దాంతో వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. ఏదైనా ఊహించని హఠాత్ పరిణామం జరిగినప్పుడు ఆ షాక్‌ను తట్టుకోవడానికి మెదడు ముందుగానే రెడీ అవుతుంది. అందులో భాగమే ఈ గూస్ బంప్స్ కూడా. గూస్ బంప్స్‌ను గూస్ ఫ్లెష్‌, గూస్ పింపుల్స్, చిల్లీ బంప్స్ అని కూడా అంటారు. అలాగే సైంటిఫిక్‌గా ఈ సెన్సేషన్‌ను 'పిలోమోటార్ రిఫ్లెక్స్' అని అంటారు. ఈ గూస్ బంప్స్ కేవలం మనుషులకే కాదు. చాలారకాల జీవులకు కూడా వస్తాయి.

First Published:  31 Oct 2022 12:45 PM IST
Next Story