Telugu Global
Health & Life Style

విటమిన్– పీ గురించి తెలుసా?

మనకు ఏ, బీ, సీ, సీ, డీ, ఈ, కే విటమిన్ల గురించి తెలుసు. కానీ, రీసెంట్‌గా ‘విటమిన్–పీ’ అనే కొత్తరకం విటమిన్ గురించి చెప్తున్నారు డైటీషియన్లు.

విటమిన్– పీ గురించి తెలుసా?
X

విటమిన్– పీ గురించి తెలుసా?

మనకు ఏ, బీ, సీ, సీ, డీ, ఈ, కే విటమిన్ల గురించి తెలుసు. కానీ, రీసెంట్‌గా ‘విటమిన్–పీ’ అనే కొత్తరకం విటమిన్ గురించి చెప్తున్నారు డైటీషియన్లు. ఇది శరీరం నుంచి పోషకాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఇదెలా లభిస్తుందంటే..

మనం తీసుకునే ఆహారం నుంచి అవసరమైన పోషకాలను గ్రహించడానికి శరీరానికి బయో ఫ్లేవనాయిడ్స్, సిట్రిన్ వంటి ప్లాంట్ కాంపౌండ్స్ కావాలి. వీటినే న్యూట్రిషనిస్టులు ‘విటమిన్–పీ’ అని పిలుస్తున్నారు. ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పోషకాలను ఎక్కువగా పొందడంలో సాయపడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

శరీరంలో విటమిన్–పీ ఉంటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి రుగ్మతలను తగ్గిస్తుంది. అవయవాల వాపు, గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, చర్మ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా శరీరంలో విటమిన్–పీ ఉండడం అవసరం. శరీరం కేలరీలను ప్రాసెస్ చేయడానికి, కొవ్వును కరిగించడానికి ఇది సాయపడుతుంది.

విటమిన్–పీ డెఫిషియన్సీ ఉంటే రకరకాల జీర్ణ సమస్యలతో పాటు పలు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలకు కూడా విటమిన్–పీ డెఫీషియన్సీ కారణం అవొచ్చు.

శరీరానికి విటమిన్–పీ అందాలంటే సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, యాపిల్, గ్రీన్ టీ, బ్రొకలీ, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవాలి. ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే హెర్బల్ టీలు కూడా విటమిన్–పీ ని అందించడంలో సాయపడతాయి.

First Published:  24 Aug 2023 5:55 PM IST
Next Story