Telugu Global
Health & Life Style

జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే!

రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా నోరూరిపోతుంది. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా, వాటిని చూస్తే మాత్రం తినకుండా ఉండలేరు చాలామంది.

జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే!
X

రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా నోరూరిపోతుంది. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా, వాటిని చూస్తే మాత్రం తినకుండా ఉండలేరు చాలామంది. అయితే జంక్ ఫుడ్స్‌ను ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ, అదే పనిగా రోజూ తింటే మాత్రం అంతే సంగతులు అంటున్నారు డాక్టర్లు. జంక్ ఫుడ్‌తో ఎలాంటి రిస్క్‌లుంటాయంటే..

‘జంక్ ఫుడ్’ అంటే క్యాలరీలు లేని అనారోగ్యకరమైన ఆహారం అని అర్ధం. ఆ విషయం తెలిసి కూడా రోజూ వాటిని లాగించేస్తుంటారు చాలామంది. కేవలం రుచి కోసం వాటికి అలవాటు పడితే.. ఫ్యూచర్‌‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జంక్ ఫుడ్స్‌లో పోషకాలు చాలా తక్కువ. పైగా వీటిని ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది. దానికి కారణం అందులో ఉండే టేస్టీ సాల్ట్స్, ఫ్యాట్స్, షుగర్స్. ఇవి మెదడు పనితీరు మందగించేలా చేస్తాయి. తద్వారా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి.

జంక్ ఫుడ్ అతిగా తింటే.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ కూడా పెరుగుతాయి. జంక్ ఫుడ్స్ నుంచి వచ్చే కొవ్వులు శరీరంలో పేరుకుపోయి.. ఒబెసిటీ సమస్యని పెంచుతుంది. దాంతో బరువు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

జంక్ ఫుడ్‌లో ఎక్కువగా వేగించిన పదార్ధాలే ఉంటాయి. వీటిలో ప్రాసెస్ చేయబడిన ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఉండే చెడు కొవ్వులు, సోడియం వంటివి రక్తపోటుని పెంచి కిడ్నీల పనితీరుని దెబ్బతీస్తాయి.

తరచుగా జంక్ ఫుడ్స్ తినడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో రకరకాల జబ్బులు బారిన పడాల్సి వస్తుంది. పలురకాల లివర్ సమస్యలు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు జంక్ ఫుడ్డే కారణం.

పిల్లలు జాగ్రత్త

పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయడం అంత మంచిది కాదు. దీని వల్ల పిల్లల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ మొదలవుతుంది. మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఎదిగే పిల్లలకు మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో మినరల్స్ ఎంతో అవసరం. అవి కేవలం కూరగాయలు. పప్పు ధాన్యాలు, ఫ్రూట్స్‌లో మాత్రమే ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఆహారంలో వాటిని కచ్చితంగా పెట్టాలి. లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చే ప్రమాదముంది.

జంక్ ఫుడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ అందవు. దాంతో పెద్దయ్యే కొద్దీ ఒక్కోటిగా ఎఫెక్ట్ చూపుతుంది. ఎదిగే పిల్లలకు ప్రొటీన్స్, ఫ్యాట్స్ అన్ని సమపాళ్లలో ఉండాలి. అప్పుడే వయసుకి తగ్గ ఎదుగుదల ఉంటుంది.

పెద్దవాళ్లకు ఇలా..

జంక్ ఫుడ్ వల్ల వయసు పైబడిన వాళ్లలో ఒబెసిటీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, ధైరాయిడ్ లాంటి సమస్యలు వస్తాయి. కార్డియాక్ అరెస్టులకు కూడా జంక్ ఫుడ్స్ కొంతవరకు కారణమవుతున్నాయి. ప్యాక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, బర్గర్, పిజ్జా, బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన ఫుడ్స్, బయట చిరుతిండ్ల వంటివి జంక్ ఫుడ్ కిందకు వస్తాయి.

First Published:  17 Dec 2023 10:15 AM
Next Story