Telugu Global
Health & Life Style

పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

శీతాకాలంలో ఎంత శ్రద్ద తీసుకున్నా పెదవులు పగులుతూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండటం, చలిగాలుల కారణంగా పెదవులు పొడిబారి.. పగులుతుంటాయి.

పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..
X

శీతాకాలంలో ఎంత శ్రద్ద తీసుకున్నా పెదవులు పగులుతూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండటం, చలిగాలుల కారణంగా పెదవులు పొడిబారి.. పగులుతుంటాయి. రాను రాను గాయాలుగా మారి మంటపుడుతాయి. విటమిన్ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం వల్ల కూడా పెదాలు పగులుతాయి. మీ పగిలిన పెదవులు తిరిగి మృదువుగా మారాలంటే ఈ హోం రెమిడీస్‌ ప్రయత్నించండి.

పెదాల పగుళ్లకు వెన్నను మించిన పరిష్కారం లేదు. పెదాలకు వెన్న పూస్తే సమస్య తగ్గడంతో పాటు...అధరాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి. చెంచా వెన్నకు చిటికెడు పంచదార యాడ్‌ చేసి సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. ఇలా కాసేపు చేస్తే... రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదాలు కాంతిమంతంగా కనిపిస్తాయి.

పగిలిన పెదవులు తిరిగి మృదువుగా మారడానికి కలబంద ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కలబంద గుజ్జులోని పాలీశీకరైడ్లు గాయాలను నయం చేస్తాయి. కలబంద గుజ్జును పెదాలకు అప్లై చేసి అరగంట పాటు ఆరనిచ్చి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే.. పెదవులు త్వరలోనే మృదువుగా మారతాయి.

చలికాలంలో పగిలిన పెదాలను మృదువుగా చేయడానికి మీగడలో చిటికెడు పసుపు మిక్స్ చేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకోవాలి. దీంతో పగిలిన పెదాలు కొద్దిరోజుల్లో గులాబీ రంగులోకి మారుతాయి.

మీ పెదవులు పగిలితే రెండు చుక్కల తేనె తీసుకొని పెదాలపై మృదువుగా మర్దనా చేయాలి. ఇందులోని యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పగుళ్లు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. అలాగే నిద్ర పోయేముందు కొబ్బరి నూని లేదా నువ్వుల నూనెను పెదాలకు రాయటం వల్ల పెదవులు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

అలాగే అసలే పగిలిన పెదాలపై లిప్స్టిక్ ను డైరెక్ట్ గా వేసుకోకుండా ముందుగా పెదవులకు కొంచెం కొబ్బరినూనె అప్లై చేసుకోవాలి. ఆతరువాత మాత్రమే లిఫ్టిక్ పూసుకోవాలి. కొబ్బరి నూనె పెదవులకు నష్టం కలగకుండా రక్షణ కవచంలా దోహదపడుతుంది. పెదవులకు తేమను అందిస్తుంది.

చలికాలంలో మనం తక్కువ నీరు తాగుతాం. నీరు లేకపోవడం వల్ల కూడా పెదవులు పగులుతాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రతిరోజూ నీరు తాగాలి. తద్వారా పెదవులలోనే కాదు మొత్తం శరీరంలో తేమ అలాగే ఉంటుంది.

First Published:  28 Dec 2023 12:55 PM GMT
Next Story