Telugu Global
Health & Life Style

బరువు తగ్గాలంటే తిండి మానక్కరలేదు.. ఇలా చెయ్యండి..

బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుతో కూడిన విషయం. కానీ సింపుల్ విషయం ఏంటంటే మెటబాలీజం పెరిగితే.. బరువు కచ్చితంగా తగ్గుతారు.

బరువు తగ్గాలంటే తిండి మానక్కరలేదు.. ఇలా చెయ్యండి..
X

బరువు తగ్గాలి అంటే డైటింగ్ అయినా చేయాలి, లేదంటే రకరకాల డైట్​లు అయినా ఫాలో అవ్వాలి. కానీ ఈ రెండు కాకుండా బరువు తగ్గేందుకు మార్గం ఉందని మీకు తెలుసా. డైట్​ చేయకుండా మంచి ఫలితాలు పొందాలనుకుంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి మీరు .

బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుతో కూడిన విషయం. కానీ సింపుల్ విషయం ఏంటంటే మెటబాలీజం పెరిగితే.. బరువు కచ్చితంగా తగ్గుతారు. కాబట్టి కేలరీలు కరిగించడానికి, జీవక్రియను పెంచుకోవడానికి, రోజూ వ్యాయామం చేయండి. చాలామంది సెలబ్రిటీలు, వారి ట్రైనర్ లు కూడా చెప్పేది ఇదే. ఏరోబిక్ వ్యాయామాలు, కండరాలను ధృడంగా చేసే ఎక్సర్​సైజ్​లు చేయవచ్చు. ఇవి మెటబాలీజంను పెంచుతాయి. వీటిని రెగ్యూలర్​గా చేస్తే మనం కదలకుండా కూర్చొన్నా జీవక్రియ సక్రమంగా జరిగి కేలరీలు బర్న్ అవుతూనే ఉంటాయి.

తగినన్ని నీళ్ళు తాగండి. ఇంకా కావాలంటే ఒక లీటర్ ఎక్కువే తాగండి. ఎందుకంటే శరీరం కాస్త డీహైడ్రేషన్​కు గురైనా బరువు పెరుగుతారు. డీహైడ్రేషన్ మెటబాలీజంపై వ్యతిరేకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన జీవక్రియ లేకుంటే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. నీరు శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపి.. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. కాబట్టి కాలం ఏదైనా నీరు తాగటాన్ని తగ్గించద్దు.

ఆహారాన్ని తీసుకునేప్పుడు చిన్న చిన్న కప్పులను కొలతగా పెట్టుకుని ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే బాగా నమిలి తినండి. బాగా నమిలినందువల్ల తీసుకున్న ఆహారం జీర్ణమై.. కొవ్వుగా మారకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది.

నిద్ర బరువును పెంచుతుంది. తగ్గిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా? నిద్రలేమితో ఇబ్బంది పడేవారు తొందరగా బరువు పెరుగుతారు. సరైన నిద్రను మెయింటైన్ చేసేవారి బరువు కంట్రోల్​లో ఉంటుంది. కాబట్టి రాత్రి పూట 7 నుంచి 9 గంటలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి.

ఒత్తిడి శారీరకంగానే కాదు.. మానసికంగానూ కూడా కృంగదీస్తుంది. నిద్రను దూరం చేస్తుంది. ఇది క్రమంగా బరువును పెంచేస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఎంచుకోండి.

First Published:  31 July 2024 3:00 PM IST
Next Story