Telugu Global
Health & Life Style

బరువు తగ్గాలంటే ఈ మిస్టేక్స్ చేయొద్దు!

బరువు తగ్గించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ రోజువారీ లైఫ్‌స్టైల్‌లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫిట్‌నెస్ గోల్‌ను రీచ్ అవ్వలేరు. బరువు తగ్గకుండా ఆపే కొన్ని పొరపాట్లు ఏంటంటే..

Weight Loss Tips in Telugu
X

Weight Loss Diet

బరువు తగ్గించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ రోజువారీ లైఫ్‌స్టైల్‌లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫిట్‌నెస్ గోల్‌ను రీచ్ అవ్వలేరు. బరువు తగ్గకుండా ఆపే కొన్ని పొరపాట్లు ఏంటంటే..

ఉదయం నిద్ర లేవగానే కప్పు కాఫీ లేదా టీ తాగే అలవాటుంటుంది చాలామందికి. అయితే ఉదయాన్నే వీటిని తాగడం వల్ల మన శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటికి పోయి శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల శరీరంలోని జీవక్రియల పనితీరు మందగిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా నిమ్మరసం లేదా గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల జీవక్రియల పనితీరును వేగవంతం అవ్వడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను బయటకు వెళ్లిపోతాయి.

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. ఉదయాన్నే షుగర్ కంటెంట్ ఉండే స్నాక్స్‌ తీసుకోవడం అంత మంచిది కాదు. దానికి బదులు ప్రొటీన్స్ ఉండే గుడ్లు, నట్స్‌ లాంటి ఆహారాన్ని తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకునేవాళ్లు చక్కెరను పూర్తిగా తగ్గించాలి. షుగర్ కంటెంట్ వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు అందుతాయి. తద్వారా బరువు తగ్గడం కష్టమవుతుంది. కావాలంటే తీపి కోసం తేనె, డేట్స్‌ వంటివి తీసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజూ ఒకే సమయానికి తినేలా చూసుకోవాలి. సమయానికి తినకపోతే ఆకలి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు వస్తాయి.

రోజులో ఎక్కువసార్లు తినడం లేదా స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ఇది బరువు తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుంది.

రోజూ సరిపడినంత నిద్ర పోకపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. రోజులో ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం వల్ల శరీరం బద్ధకించి బరువు తగ్గడానికి బదులుగా మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలంటే స్లీప్ సైకిల్‌ను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

శరీరానికి విటమిన్‌ డి సరిగ్గా అందకపోయినా బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే గుడ్లు ఎక్కువగా తింటూ రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి.

ఇక వీటితో పాటు రోజూ ఉదయాన్నే ఇరవై నిమిషాల పాటు చిన్న పాటి వ్యాయామాలు చేయడం, కాయగూరలు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గడం మరింత ఈజీ అవుతుంది.

First Published:  29 March 2023 6:25 AM IST
Next Story