Telugu Global
Health & Life Style

బరువు తగ్గేందుకు డైట్ బెటరా? లేక మందులా?

బరువు తగ్గడం కోసం మందులు వాడడం కంటే డైట్‌ను ఫాలో అవ్వడమే మంచిదని డాక్టర్ల సలహా.

Weight loss: బరువు తగ్గేందుకు డైట్ బెటరా? లేక మందులా?
X

Weight loss: బరువు తగ్గేందుకు డైట్ బెటరా? లేక మందులా?

బరువును తగ్గించుకోడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విధానాన్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది డైట్, ఎక్సర్‌‌సైజ్‌ల ద్వారా బరువు తగ్గించుకుంటారు. మరి కొంతమంది వెయిట్‌లాస్ సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. అసలు వీటిలో ఏ అప్షన్ మంచిది? డాక్టర్లు ఏమంటున్నారు?

బరువు తగ్గడం కోసం మందులు వాడడం కంటే డైట్‌ను ఫాలో అవ్వడమే మంచిదని డాక్టర్ల సలహా. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌.. ఇలా రకరకాల డైట్ంలు , ఫాస్టింగ్ మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి ద్వారా ఈజీగా వెయిట్‌లాస్ అయిన వాళ్లూ ఉన్నారు.

అయితే డైట్‌, వ్యాయామం లాంటివి చేయలేని వాళ్లు వెయిట్‌లాస్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు. ఇవి తినే ఆహారంలోని కొవ్వును జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. మరికొన్ని సప్లిమెంట్లు ఆకలిని చంపి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇలాంటి ట్యాబ్లెట్లు ఎక్కువరోజుల పాటు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ.

వేగంగా బరువు తగ్గాలనుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అందుకే నిదానంగా బరువు తగ్గే ఆప్షన్స్‌ ఎంచుకోవాలి. తక్కువ మొత్తంలో, తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ నెమ్మదిగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గాలంటే కాయగూరలు, ఆకుకూరలు, నట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. కొవ్వు పదార్ధాలు తగ్గించాలి. కార్డియో వ్యాయామాలు చేయాలి. ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఓ మంచి పద్ధతి. ఇందులో 16 నుంచి 18 గంటల పాటు ఉపవాసం ఉండడం వల్ల వేగంగా కొవ్వు కరుగుతుంది. అయితే ఈ ఫాస్టింగ్ంతో కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లెమ్స్ రావొచ్చు.

First Published:  15 Jun 2023 2:00 AM IST
Next Story