సమ్మర్‌లో బరువు తగ్గడం ఈజీ! ఎలాగంటే..
మిగతా సీజన్లలో కంటే సమ్మర్‌లో బరువు తగ్గడం ఈజీ అంటున్నారు నిపుణులు. కేవలం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సీజన్‌లో మరింత ఫిట్‌గా మారొచ్చట.
మిగతా సీజన్లలో కంటే సమ్మర్‌లో బరువు తగ్గడం ఈజీ అంటున్నారు నిపుణులు. కేవలం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సీజన్‌లో మరింత ఫిట్‌గా మారొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలం సహజంగానే ఎక్కువ నీళ్లు, లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలనిపిస్తుంది. అలాగే హెవీ ఫుడ్స్ తినాలన్న కోరిక తగ్గుతుంది. కాబట్టి వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టడానికి ఇదే అనువైన సమయం. డైట్ ఇంకా అలవాట్లపై కాస్త ఫోకస్ పెడితే సమ్మర్ లో క్రమంగా ఫిట్‌గా మారొచ్చు. ఇవే అలవాట్లను ఇకపై కూడా కంటిన్యూ చేస్తే మీ వెయిట్ లాస్ టార్గెట్‌ను పూర్తి చేయొచ్చు.
ప్లానింగ్ ఇలా..
సమ్మర్‌లో లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. కాబట్టి డైట్‌లో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోజుకి ఒక మీల్ అన్నం తీసుకుని డిన్నర్, స్నాక్స్ సమయాల్లో పండ్లు లేదా పండ్ల రసాల వంటివి తీసుకోవడం ద్వారా మీ వెయిట్ లాస్ జర్నీ మొదలవుతుంది.
సమ్మర్‌లో రోజంతా ఏసీ గదుల్లో గడిపినా.. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లగాలికి బయటకు వచ్చి కాసేపు వాకింగ్ లేదా జాగింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకొవాలి. చాలామంది ఈ సీజన్‌లో స్విమ్మింగ్ చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అది కూడా మంచిదే.
ఈ సీజన్‌లో డైజెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వీలైనంత వరకూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లో గోధుమలు, మిల్లెట్స్ వంటి పైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్‌ను ఎంచుకోవాలి. కూరల కోసం వాటర్ కంటెంట్ ఉండే కూరగాయలను ఎంచుకోవాలి.
సమ్మర్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడిపే అవకాశం వస్తుంది చాలామందికి. ఇలాంటివాళ్లు ప్రయాణాలు చేయడం, ఆటలు ఆడడం వంటి యాక్టివిటీస్ ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అలాగే సమ్మర్ సెలవుల్లో మీరు వదిలేసిన పాత హ్యాబిట్స్‌ను తిరిగి అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించుకునేందుకు ఒక దారి దొరుకుతుంది. అలా సమ్మర్‌లో లైఫ్‌స్టైల్‌ను రీస్టా్ర్ట్ చేయొచ్చు.
సమ్మర్‌లో ఎండ కారణంగా విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు శరీరానికి శోషణ శక్తి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం చక్కగా ఒంటబడుతుంది.
జాగ్రత్తలు కూడా..
ఇకపోతే సమ్మర్‌లో జాగ్రత్తపడాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో చెమటల ద్వారా నీటిశాతం తగ్గుతుంది. కాబట్టి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగుతుండాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.