Telugu Global
Health & Life Style

చలిలో ఎక్కువ తిరుగుతున్నారా? ఇది తెలుసుకోండి!

తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చలిగా ఉన్నప్పుడు స్వెటర్లు, టోపీల వంటివి వాడుతూ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

చలిలో ఎక్కువ తిరుగుతున్నారా? ఇది తెలుసుకోండి!
X

జనవరి నెలలో చలి కాస్త ఎక్కువగా పెడుతుంటుంది. దీంతోపాటు ప్రతి ఏటా చలి తీవ్రతలు పెరుగుతూ పోతున్నాయి. ఇలాంటి టైంలో చలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చలిగా ఉన్నప్పుడు స్వెటర్లు, టోపీల వంటివి వాడుతూ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చలిని పట్టించుకోకుండా బయట ఎక్కువగా తిరగడం వల్ల కొన్ని సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అవేంటంటే..

శ్వాస సమస్యలు

చలిలో ఎక్కువగా తిరగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆస్తమా లేదా ఇతర శ్వాస సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. సైనస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు కూడా చలి ప్రమాదకరంగా మారగలదు. కాబట్టి చలికి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వంటిది ధరించాలి. చల్లగాలిని నేరుగా పీల్చకుండా జాగ్రత్తపడడం మంచిది.

రక్తపోటు

చల్లగాలులు తగిలినప్పుడు శరీరం వేడిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. తద్వారా రక్తపోటుతో పాటు గుండె వేగం పెరుగుతుంది. ఇది పలు సమస్యలకు కారణమవ్వొచ్చు. కొలెస్ట్రాల్, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదంగా మారొచ్చు.

ఇమ్యూనిటీ

చలికాలం వైరస్, బ్యా్క్టీరియాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇన్పెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు చలికాలం ఇమ్యూనిటీ కూడా కాస్త తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే అంటురోగాల వంటివి కూడా చలికి ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే చల్లగాలుల వేళ జాగ్రత్తగా ఉండడం అవసరం.

హైపోథెర్మియా

శరీరం ఉన్నట్టుండి అధిక చలికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీన్నే హైపోథెర్మియా అంటారు. గడ్డకట్టే చలిలో ఎక్కువసేపు గడిపినప్పుడు, గడ్డకట్టే నీటిలో ఒక్కసారిగా మునిగినప్పుడు ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఫ్రాస్ట్ బైట్

ఉన్నట్టుండి చలి తగలడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు ఫ్రాస్ట్‌బైట్‌కు గురవుతాయి. చర్మం ఎర్రగా మారడం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక చలి.. శరీర కణజాలాన్ని పాడుచేస్తుంది. కాబట్టి మంచు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

First Published:  17 Jan 2024 1:15 PM IST
Next Story