వాల్యుమెట్రిక్ డైట్ గురించి తెలుసా?
వాల్యుమెట్రిక్ డైట్‌లో చిన్న చిన్న ట్రిక్స్ వాడి ఆకలిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొద్దిమొత్తాల్లో తీసుకున్నా కడుపు నిండేలా చేసే ప్రొటీన్స్, ఇతర పోషకాహారాలను ఎక్కువగా తీసుకుంటారు.
బరువు తగ్గడం కోసం రకరకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకుంటారు చాలామంది. బలవంతంగా ఆకలిని చంపుకుంటూ పస్తులు ఉంటారు. అయితే ఆకలిని కంట్రోల్ చేసే పని లేకుండా బరువు తగ్గే డైట్ ఒకటుంది. అదే ‘వాల్యుమెట్రిక్ డైట్’. ఇదెలా ఉంటుందంటే.
వెయిట్‌లాస్ కోసం ట్రై చేసే చాలామంది క్రేవింగ్స్‌తో కుస్తీలు పడుతుంటారు. నోరు తినాలని కోరుకుంటున్నా అతి కష్టం మీద దాన్ని అదుపు చేస్తుంటారు. అయితే వాల్యుమెట్రిక్ విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ డైట్ విధానంలో కడుపు మాడ్చుకోవాల్సిన పని లేకుండానే బరువు తగ్గొచ్చు.
వాల్యుమెట్రిక్ డైట్‌లో చిన్న చిన్న ట్రిక్స్ వాడి ఆకలిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొద్దిమొత్తాల్లో తీసుకున్నా కడుపు నిండేలా చేసే ప్రొటీన్స్, ఇతర పోషకాహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటూ క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలు ఈ డైట్‌లో ఎంచుకుంటారు. దీనివల్ల ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే వీలుంటుంది. అయితే ఇది ఇన్‌స్టంట్‌గా పనిచేసే డైట్ కాదు. కొంతకాలం పాటు క్రమంగా ఈ డైట్‌ను అనుసరిస్తే మెల్లగా బరువు కంట్రోల్‌లోకి వస్తుంది. ఆకలి చంపుకోకుండా, వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గే వీలుంటుంది.
వాల్యుమెట్రిక్ డైట్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్ల వంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదట కొన్నిరోజులు జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్స్‌ను తగ్గించి పూర్తిగా పండ్లు, కాయగూరలే తీసుకోవాలి. ఆకలి తీరడానికి పండ్లను మాత్రమే ఫుడ్‌గా ఎంచుకోవాలి. కడుపు నిండే వరకూ ఎన్ని పండ్లయినా తినొచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి మిల్లెట్స్ మొదలుపెట్టాలి. పండ్లను తగ్గించి మిల్లెట్స్‌ను మెయిన్ మీల్‌గా తీసుకోవాలి. ఆకలి తీరడానికి మిల్లెట్స్ మెయిన్ మీల్‌గా ఉండాలి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకలిని కంట్రోల్ చేయకుండా శరీరానికి క్రమంగా క్యాలరీలు తగ్గించడమే ఈ డైట్ టెక్నిక్.
లాభాలివీ
ఈ డైట్ వల్ల పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.
ఈ డైట్ ద్వారా ఆకలిని చంపుకోవాల్సిన పని లేదు.
ఈ డైట్ పాటిస్తుంటే లాంగ్ టర్మ్ లో ఈజీ బరువు తగ్గొ్చ్చు. జిమ్‌కెళ్లి కుస్తీలు పట్టా్ల్సిన పని లేదు.
ఈ డైట్ లో జంక్ ఫుడ్ తప్ప మరేదైనా తినొచ్చు. అయితే ఒక్కో దశలో ఒక్కోరకమైన పోషకాలను తీసుకోవాలి.