Telugu Global
Health & Life Style

చేతివేళ్లతో పనిచేస్తున్నారా? ట్రిగర్ ఫింగర్ రావొచ్చు జాగ్రత్త!

కంప్యూటర్స్‌పై పనిచేసేవాళ్లంతా ఎక్కువగా చేతివేళ్లకే పని చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు మొబైల్ వాడేటప్పుడు కూడా వేళ్లకే పని. ఇలా రోజులో ఎక్కువసేపు వేళ్లను కష్టపెట్టడం ద్వారా చాలామందికి ‘ట్రిగర్ ఫింగర్’ అనే సమస్య వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు.

చేతివేళ్లతో పనిచేస్తున్నారా? ట్రిగర్ ఫింగర్ రావొచ్చు జాగ్రత్త!
X

చేతివేళ్లతో పనిచేస్తున్నారా? ట్రిగర్ ఫింగర్ రావొచ్చు జాగ్రత్త!

కంప్యూటర్స్‌పై పనిచేసేవాళ్లంతా ఎక్కువగా చేతివేళ్లకే పని చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు మొబైల్ వాడేటప్పుడు కూడా వేళ్లకే పని. ఇలా రోజులో ఎక్కువసేపు వేళ్లను కష్టపెట్టడం ద్వారా చాలామందికి ‘ట్రిగర్ ఫింగర్’ అనే సమస్య వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. ఇదెలా ఉంటుందంటే..

కంప్యూటర్ కీబోర్డ్, టచ్‌స్ర్కీన్లపై అదే పనిగా వేళ్లతో పనిచేయడం వల్ల చేతి వేళ్లపై అదనపు ఒత్తిడి పడి వేళ్లు మందగించడం, బిగుసుకుపోవడం వంటి సమస్యలొస్తాయట. దీన్నే ‘ట్రిగర్‌ ఫింగర్‌’ అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా20 కోట్ల మంది ట్రిగర్ ఫింగర్ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ముందుగా చేతివేళ్లు ఒత్తిడికి గురయ్యాయి అని గుర్తించేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వేళ్ల కదలికలు నెమ్మదిస్తాయి, టైప్ చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. వేళ్లు విరిచేటప్పుడు కూడా నొప్పిగా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తుంటే ట్రిగర్ ఫింగర్ ఉన్నట్టు లెక్క. చేతి వేళ్లలో ఉండే మృదువైన కణజాలంపై అదనపు ఒత్తిడి పడినప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాకపోయినా అదే పనిగా ఒత్తిడి పెంచితే వేళ్లు వాయడం లేదా కదల్చలేకుండా ఫ్రీజ్ అవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.

అయితే ఈ సమస్య కేవలం కంప్యూటర్ పై పనిచేసేటప్పుడే కాదు, పేపరు పై అదేపనిగా రాస్తున్నప్పుడు లేదా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నప్పుడు కూడా రావొచ్చు. ఇలాంటి సమయంలో చేతి వేళ్లకు పని చెప్పకుండా విశ్రాంతినివ్వాలి. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు.

First Published:  3 Nov 2023 7:58 AM IST
Next Story