బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!
అందంగా కనిపించడం కోసం చాలామంది క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ వంటి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు మస్ట్ అంటున్నారు నిపుణులు.
అందంగా కనిపించడం కోసం చాలామంది క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ వంటి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు మస్ట్ అంటున్నారు నిపుణులు. అవేంటంటే...
రోజువారీ మేకప్‌లో భాగంగా చాలామంది ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సీరమ్, లిప్ బామ్స్, టోనర్, ఫేస్ ప్యాక్స్.. ఇలా చాలారకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. రకరకాల కెమికల్స్‌తో తయారయ్యే ఇలాంటి ప్రొడక్ట్స్‌ను సరిగా వాడకపోతే కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది.
ముందుగా బ్యూటీ ప్రొడక్ట్స్ కొనేముందు వాటిపై ఉండే ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయడంతో పాటు వాటిని ఎంతకాలం పాటు వాడతారు అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు 500 మి.లీ. బాడీ లోషన్.. కొన్ని నెలలపాటు వస్తుంది. ఒకవేళ తక్కువ ఎక్స్‌పైరీ డేట్ ఉన్న ప్రొడక్ట్ తీసుకుంటే అది ఎక్స్‌పైర్ అయిపోయాక కూడా తెలియక అలాగే వాడే ప్రమాదముంది. కాబట్టి కొనేముందు వీలైనంత ఎక్కువ ఎక్స్‌పైరీ డేట్ ఉన్న ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి.
సాధారణంగా ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్ వంటి ప్రొడక్ట్స్ ఎక్కువకాలం పాడవ్వకుండా ఉంటాయి. కానీ, టోనర్, సీరమ్, సన్‌స్క్రీన్ లోషన్ల వంటివి మూత తెరిచిన ఆరునెలల్లోపు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ కొనేటప్పుడు తక్కువ క్వాంటిటీ ఉండే వాటిని ఎంచుకోవాలి. అలాగే ముఖానికి వాడే విటమిన్–ఈ ఆయిల్స్, విటమిన్–సీ ప్రొడక్ట్స్ వంటివి మూడు నెలలకోసారి మారిస్తే మంచిది.
ఏవైనా బ్యూటీ ప్రొడక్ట్స్ కొంత కాలం తర్వాత రంగు లేదా వాసన మారినట్టు గమనిస్తే వాటిని వాడకూడదు. పాడైపోయిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి వంటి సమస్యలు రావొచ్చు.
ఇకపోతే ఖరీదైన ప్రొడక్ట్స్ కొనేటప్పుడు వాటిని ఎలా భద్రపరచాలో కూడా తెలుసుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్న విధంగా సన్ లైట్ లేని చోట చల్లని ప్రదేశంలో ఉంచితే ఎక్కువకాలం పాటు పాడవ్వకుండా ఉంటాయి.
అన్నింటికంటే ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంచుకునేటప్పుడు చర్మతత్వాన్ని బట్టి స్కిన్ స్పెషలిస్ట్ సలహా మేరకు ప్రొడక్ట్స్ ఎంచుకుంటే మంచిది. అలాగే వీలైనంత వరకూ సహజమైన ఉత్పత్తులు ఎంచుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి.