Telugu Global
Health & Life Style

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ రిపోర్ట్! ప్రపంచం ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందంటే..

ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థను అంచనా వేస్తూ ప్రతీ ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ రిపోర్ట్ తయారు చేస్తుంది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ రిపోర్ట్! ప్రపంచం ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందంటే..
X

ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థను అంచనా వేస్తూ ప్రతీ ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ రిపోర్ట్ తయారు చేస్తుంది. తాజాగా విడుదలైన ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్ రిపోర్ట్’లో నమోదైన విషయాలను పరిశీలిస్తే..

ప్రతి ఏటా డిసెంబర్ 12న ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్(యూహెచ్‌సీ) డే’ ను జరుపుతుంది. ప్రపంచంలో ఆరోగ్య సేవలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? వ్యాధుల చికిత్సలు, నివారణలు, మరణాలకు కారణాలు, వైద్య సదుపాయాలు. ఇలాంటి పలు అంశాలను ఇందులో పరిశీలిస్తారు. ప్రపంచవ్యా్ప్తంగా బలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించేందుకు ఈ రిపోర్ట్ పనికొస్తుంది. ఈ ఏడాది రిపోర్ట్‌లో వెల్లడైన విషయాలేంటంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. ‘అందరికీ ఆరోగ్యం: టైం ఫర్ యాక్షన్’ అనే థీమ్‌పై పనిచేయాలని ప్రపంచ నాయకులను కోరింది. ఈ మేరకు విడుదల చేసిన రిపోర్ట్ లో ప్రపంచంలో దాదాపు సగం మందికి ఆరోగ్య సేవలు అందుబాటులో లేవని, ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం మంది జేబులో ఆరోగ్య ఖర్చులకు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కోంది. ప్రపంచంలోని చాలాచోట్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆరోగ్య అసమానతలు పెరుగుతున్నట్టు గుర్తించింది. 2030 కల్లా ప్రపంచంలో పూర్తి హెల్త్ కవరేజ్ ఉండేలా, ప్రతిఒక్కరూ మెరుగైన ఆరోగ్య సేవలు పొందేలా కృషి చేయాలని ప్రపంచదేశాలను కోరింది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్‌లో కెనడా దేశం ముందు ఉంది. ఆ దేశంలో 91 శాతం హెల్త్ కవరేజ్ ఉంది. సౌత్ కొరియా దేశం 89 శాతం జనాభాకు వైద్య సేవలను ప్రొవైడ్ చేస్తుంది. లిస్ట్‌లో వరుసగా ఐస్‌ల్యాండ్, సింగపూర్, జర్మనీ, పోర్చుగల్, యూకె, నార్వే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, యూఎస్, జపాన్, చైనా దేశాలున్నాయి. మనదేశంలో హెల్త్ కవరేజ్ 63.33 శాతం ఉంది. పాకిస్తాన్ స్కోర్ 45.21 గా ఉంది.

First Published:  16 Dec 2023 11:30 AM IST
Next Story