Telugu Global
Health & Life Style

ఉగాది పచ్చడితో ఎన్ని బెనిఫిట్స్ అంటే..

ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచులతో చేసే ఈ పచ్చడితో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఉగాది పచ్చడితో ఎన్ని బెనిఫిట్స్ అంటే..
X

ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచులతో చేసే ఈ పచ్చడితో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఇందులో ఉండే రుచులు, వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది పచ్చడి కోసం వాడే ఆరు రకాల పదార్థాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఇందులో ఉండే తీపి, చేదు, వగరు, కారం, ఉప్పు, పులుపు.. వంటి రుచులతో వేర్వేరు ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేంటంటే.

పచ్చి మామిడి ముక్కలు, చింతపండు రసం, కొద్దిగా బెల్లం, వేప పువ్వు, కారం, ఉప్పు వేసి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. ఇందులో వేసే బెల్లం శరీరంలో రక్త కణాలను పెంపొందించడానికి, టాక్సిన్స్‌ను బయటికి పంపించడానికి తోడ్పతుంది. అలాగే బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, సెలీనియం.. వంటి మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



ఉగాది పచ్చడిలో వేసే వేప పువ్వు శరీరానికి యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. వేపకు పొట్టలోని క్రిములను నాశనం చేసే గుణం ఉంటుంది. అలాగే రక్త శుద్ధికి, డయాబెటిస్ కంట్రోల్‌కు కూడా వేప మంచిది.

ఉగాది పచ్చడిలో వగరు కోసం వాడే పచ్చి మామిడి వల్ల బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్‌–సి శరీరంలో ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది. అలాగే మామిడి జీర్ణ వ్యవస్థను, చర్మాన్ని, కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఉగాది పచ్చడిలో వేసే కారం కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అలాగే మిరపలో ఉండే ‘క్యాప్సైచిన్‌’ అనే పదార్థం పెయిన్ కిల్లర్‌‌గా పనిచేస్తుంది. జలుబుని తగ్గిస్తుంది.

పచ్చడిలో వేసే చింతపండు అజీర్తి సమస్యను తగ్గించడంతోపాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని నివారిస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా చింతపండు మేలు చేస్తుంది. ఇక చివరిగా పచ్చడిలో వేసే ఉప్పు శరీరంలోని లవణాలను బ్యాలెన్స్ చేస్తుంది. నీరసం రాకుండా చూస్తుంది.

First Published:  8 April 2024 3:45 PM IST
Next Story