Telugu Global
Health & Life Style

చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే..

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. వణికించే చలితో పాటు బిగుసుకుపోయిన కీళ్లు బాగా వేధిస్తాయి. ఈ కీళ్ల నొప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే..
X

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. వణికించే చలితో పాటు బిగుసుకుపోయిన కీళ్లు బాగా వేధిస్తాయి. ఈ కీళ్ల నొప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాతావరణంలో గాలి ఒత్తిడి మార్పులు వల్ల కీళ్ల నొప్పులు కలుగుతాయి. శరీరం చుట్టుపక్కల గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు కీళ్ల చుట్టూరా కండరాలు, కణజాలాలు వ్యాకోచిస్తాయి. దానివల్ల కీళ్ల మీద ఒత్తిడి పడి నొప్పి కలుగుతుంది.

కీళ్ల నొప్పులు వేధిస్తున్నప్పుడు కొద్దిగా ఇసుక తీసుకుని దాన్ని వేడి చేసి, బట్టలో చుట్టి నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల కదలికలు మృదువుగా మారతాయి. నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులకు గోరు వెచ్చని నీటితో పాటు, చల్లటి నీటితో కాపడం పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.

కీళ్ల నొప్పులున్న వాళ్లు రాత్రి పడుకునే సమయంలో మోకీళ్ల చుట్టూ క్రేప్‌ బ్యాండేజ్‌ చుట్టడం లేదా దిండు, టవల్‌ లాంటివి మోకాళ్ల కింద పెట్టుకుంటే నొప్పులు పెరగకుండా ఉంటాయి.

నొప్పులు మరీ ఎక్కువైనప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి, కీళ్లపై నెమ్మదిగా మర్దన చేస్తే ఇన్‌స్టంట్ రిలీఫ్ ఉంటుంది.

ఇకపోతే చలి ఎక్కువగా ఉందని ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోవడం, సోఫాలో గంటల కొద్దీ కూర్చోవవడం ద్వారా కీళ్లు బిగుసుకుపోయి, నొప్పులు ఎక్కువవుతాయి. అందుకే అప్పుడప్పుడు నడుస్తుండాలి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలను సాగదీసే వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. ఎక్కువ రోజుల పాటు నొప్పులు వేధిస్తుంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

First Published:  9 Nov 2022 1:35 PM IST
Next Story