క్రియేటివ్‌గా ఆలోచించేందుకు టిప్స్!
క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలుగుతారు. పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా క్రియేటివిటీ ఉన్నవాళ్లకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది.
క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలుగుతారు. పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా క్రియేటివిటీ ఉన్నవాళ్లకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్‌లో క్రియేటివ్ సొల్యూషన్స్ ఆలోచించడం చాలా అవసరం. మరి క్రియేటివ్‌గా ఆలోచించడాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
సమస్యలకు భిన్నమైన సొల్యూషన్స్ ఆలోచించడం, జీవితాన్ని కొత్త యాంగిల్‌లో చూడడమే క్రియేటివిటీ అంటే.. మిగతావారికి రాని ఆలోచన మీకు వచ్చిందంటే మీరు క్రియేటివ్‌గా ఆలోచిస్టున్నట్టు లెక్క. అయితే ఈ స్కిల్.. పుట్టుకతో రాదు. మనమే అలవరచుకోవాలి. అదెలాగంటే..
క్రియేటివిటీని పెంపొందించుకోవడం కోసం రకరకాల ఆలోచనావిధానాలను స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకే విషయంపై రకరకాల వ్యక్తులు రాసిన పుస్తకాలు చదవొచ్చు. అప్పుడు ఒక విషయాన్ని ఎన్ని కోణాల్లో చూడొచ్చో అర్థం అవుతుంది.
క్రియేటివ్‌గా ఎదగాలంటే క్రియేటివ్ వర్క్స్‌ను అబ్జర్వ్ చేయాలి. అంటే పెయింటింగ్స్, సినిమాలు, కవిత్వం, ప్రపంచంలో వస్తున్న కొత్త ఇన్నొవెషన్స్, సైన్స్ వంటి టాపిక్స్‌పై కొంత అవగాహన పెంచుకోవాలి. ఇలా కొంత వర్క్ చేస్తే క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్ల మనస్తత్వం అర్థమవుతుంది.
ఇక ప్రాక్టికల్‌గా క్రియేటివిటీని పెంపొందించుకోవాలంటే.. ముందుగా రిస్క్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గతంలో ఎవరూ వెళ్లని దారిని ఎంచుకుని ప్రయాణం మొదలుపెట్టాలి. మీరు ఎంచుకున్న రంగంలో కొత్త దారులు వెతికే ప్రయత్నం చేయాలి.
రోజూ కొంతసేపు మౌనంగా కూర్చోవడం ద్వారా క్రియేటివిటీ పెరుగుతుందని స్టడీల్ల తేలింది. మౌనంగా కూర్చొని.. మనసుని రిలాక్స్‌డ్‌గా ఉంచడం ద్వారా మెదడు పూర్తిగా రీస్టార్ట్ అవుతుంది. కొత్త ఐడియాలు వచ్చేందుకు ఈ టెక్నిక్ హెల్ప్ చేస్తుంది.
వీలున్నప్పుడల్లా కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయడం, కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా కొత్త కొత్త ధృక్పదాలు అలవాటయ్యే అవకాశం ఉంటుంది.
ఏదైనా సమస్యకు మొదటగా వచ్చే సొల్యూషన్ చాలా బేసిక్‌గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఐడియాలను అమలు చేసేముందు కొంత సమయం తీసుకోవడం ముఖ్యం. ఐడియాలను బుక్‌లో రాసుకుని మీకు వచ్చిన నాలుగైదు ఐడియాల్లో బెస్ట్ ఐడియాను ఎంచుకోవాలి.
ఇక వీటితోపాటు మానసిక ఆరోగ్యాన్ని సరి చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఆలోచనల్లో పడి ఒత్తిడికి లోనవ్వడం ద్వారా మెదడు పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేసుకోవాలి.