Telugu Global
Health & Life Style

చలికాలం ఒళ్లు నొప్పులు తగ్గాలంటే ఇలా చేయాలి!

చలికాలం చాలామందికి ఒంటినొప్పుల సమస్య వేధిస్తుంటుంది. మోకాళ్లు, భుజం కండరాలు, నడుము.. ఇలా ఏదోరకమైన నొప్పి మొదలవుతుంటుంది.

చలికాలం ఒళ్లు నొప్పులు తగ్గాలంటే ఇలా చేయాలి!
X

చలికాలం చాలామందికి ఒంటినొప్పుల సమస్య వేధిస్తుంటుంది. మోకాళ్లు, భుజం కండరాలు, నడుము.. ఇలా ఏదోరకమైన నొప్పి మొదలవుతుంటుంది. మరి ఇలాంటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

చలికాలం శారీరక శ్రమ లేకపోవడం, చలికి కండరాలు బిగుసుకుపోవడం వంటి కారణాల చేత ఒళ్లు నొప్పులు మొదలవుతుంటాయి. అయితే వీటికి చెక్ పెట్టడం ఎంతో తేలిక. చేయాల్సింది ఏంటంటే..

చలికాలంలో కదలకుండా కూర్చోవడం, ఎక్కువగా పడుకుని ఉండేవాళ్లకు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి రోజూ కొంత సమయం జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని కదిలించాలి. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్‌గా నొప్పులు తగ్గుతాయి.

చలికాలం నొప్పులుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా నొప్పుల నుంచి ఇన్‌స్టంట్ రిలీఫ్ పొందొచ్చు. అలాగే చలికాలంలో తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల కూడా కీళ్లు పట్టేస్తుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో హైడ్రేటెడ్‌గా ఉండడం ముఖ్యం.

శరీరంలో విటమిన్–డి లోపించడం వల్ల రకరకాల నొప్పులు మొదలవుతాయి. కాబట్టి వింటర్‌‌లో ఉదయం ఎండలో కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. విటమిన్–డి కోసం గుడ్లు, చేపలు, పాలు, నట్స్ వంటివి తీసుకోవాలి.

కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవాళ్లు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చూసుకోవాలి. ఒకేచోట కూర్చోవడం, పడుకోవడం చేయకుండా గంటకోసారి పొజిషన్ మార్చుతూ ఉండాలి.

చలికాలంలో ఇమ్యూనిటీ కోసం సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తాగొచ్చు. అలాగే విటమిన్–కె కోసం ఆకుకూరలు, బీన్స్, క్యాబేజ్, బ్రొకొలీ వంటివి తీసుకోవాలి.

చలికాలంలో కండరాలు, కీళ్లు పట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వెయిట్ ఎక్సర్‌‌సైజులను తగ్గించాలి

First Published:  29 Dec 2023 2:00 PM IST
Next Story