Telugu Global
Health & Life Style

ఈ ఐదు లక్షణాలు మీ హార్ట్‌ ఫెయిల్యూర్‌ ను చెప్పేస్తాయ్‌

వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమవుతాయి.. హెచ్చరిస్తోన్న డాక్టర్లు

ఈ ఐదు లక్షణాలు మీ హార్ట్‌ ఫెయిల్యూర్‌ ను చెప్పేస్తాయ్‌
X

హార్ట్‌ ఫెయిల్యూర్‌.. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన మనిషిని కుప్పకూలిపోయేలా చేస్తుంది. కానీ గుండె ఉన్నట్టుండి ఒక్కసారే వైఫల్యం చెందదని.. అంతకు ముందు అనేక ఇండికేషన్స్‌ ఇస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అలాంటివి కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యాన్ని క్రమేణ తగ్గిపోతుందని, ఇది ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే హార్ట్‌ ఫెయిల్యూర్‌ పై ఇచ్చే సంకేతాలను పసిగట్టి ప్రాణాలు రక్షించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐదు లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి..

శ్వాసకు సంబంధించిన ఏ సమస్య అయినా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కు దారి తీయవచ్చు.. శ్వాస ఆడకపోవడం, ఇప్పటికే గుండె సమస్యలతో బాధ పడుతున్న వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే జాగ్రత్త పడాలి. కాలు, మోకాలు, చీల మండలంలో వాపు ఉంది అంటే అది హార్ట్‌ ఫెయిల్యూర్‌ కు సంకేతం అనుకోవాలి. అలసట, బలహీనతలను కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్‌ లోడ్‌ తో అలసట కనిపించినా జాగ్రత్త పడితీరాలి. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా దగ్గు, గురక సమస్యలు కూడా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కు ముందు కనిపిస్తాయి. గుండె సరిగా పని చేయకుంటే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలవుతుంది.. ఫలితంగా శ్వాసలోపం తలెత్తుతుంది. కాబట్టి గురకను కూడా లైట్‌ తీసుకోవద్దు. హార్ట్‌ బీట్‌ పద్ధతి ప్రకారం లేకపోవడం, ఎక్సర్‌సైజ్‌ చేసే కెపాసిటీ తగ్గిపోవడం, బొడ్డు ప్రాంతంలో వాపు కూడా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కు ముందు కనిపించే లక్షణాలు. ఇలాంటివి కనిపించినపుడు జాగ్రత్త పడి వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  25 Sept 2024 5:40 PM IST
Next Story