Telugu Global
Health & Life Style

మెదడును డ్యామేజ్‌ చేసే అలవాట్లు ఇవే!

మెదడు మీద ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచిస్తున్న నిపుణులు

మెదడును డ్యామేజ్‌ చేసే అలవాట్లు ఇవే!
X

కొన్ని అలవాట్ల కారణంగా తెలియకుండానే మెదడు డ్యామేజ్‌కు కారణమవుతున్నాం. అవి ఏమిటి? వాటికి పరిష్కారాలు ఏమిటో నిపుణులు వివరిస్తున్నారు. టిఫిన్‌ ను స్కిప్‌ చేయడం, లేదా పోషకాలు లేని ఆహారం తీసుకున్నా ఏకాగ్రత లోపిస్తుంది. ఎక్కువ టైంతోపాటు ఆహారం తీసుకోకుండా ఉంటే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్‌ వద్దు.. ఒకేసారి కంగారుగా రెండు పనులు చేస్తే దేనిపైనా దృష్టి సారించలేరు. దీంతో మెదడు మీద ఒత్తిడి పడుతుంది అంటున్నారు.

సంగీతం వినడం మంచిదే.. కానీ ఎక్కువ సౌండ్‌తో ఇయర్‌ఫోన్స్‌, బడ్స్‌ వింటే.. చెవి నుంచి మెదడుకు అనుసంధానమై ఉన్న నరాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో సరిపడా నిద్ర లేకపోతే ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. భావోద్వేగాలు అదుపులో ఉండవు. అల్జీమర్స్‌ కూడా వస్తుంది అంటున్నారు. గంటల కొద్దీ స్క్రీన్‌ను అలాగే చూస్తూ ఉండటం వల్ల ఆ లైట్‌ ప్రభావం కళ్లతో పాటు మెదడుపైనా పడుతుంది. నిద్రకు భంగం కలిగించడమే కాకుండా మానసిక సమస్యలూ వస్తాయి. అధిక ఫ్యాట్‌, చెక్కర కలిగిన ఆహారం తీసుకోవడంతో ఆక్సిడేటిడ్‌ స్ట్రెస్‌ పడుతుంది. మెదడు వాపునకు దారి తీస్తుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతాయి.

శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం కూర్చొనే ఉంటే .. మెదడులో రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో ఒత్తిడితో పాటు ఆందోళన కలుగుతుంది. సిగరెట్లు తాగడం ద్వారా రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిదానిస్తుంది. దీనివల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలున్నాయి. మద్యపానంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తితో పాటు నిర్ణయాలు తీసుకునే శక్తీ తగ్గుతుంది.

First Published:  27 Dec 2024 4:21 PM IST
Next Story