Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో జలుబు చేస్తోందా? ఈ జాగ్రత్తలు మస్ట్!

సాధారణంగా జలుబు, దగ్గు వింటర్‌‌లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే సమ్మర్‌‌లో ఉండే అధిక వేడి, పొడి వాతావరణం వల్ల కూడా కొంతమందిలో జలుబు చేస్తుంటుంది. దీన్నే ‘సమ్మర్ కోల్డ్’ లేదా ‘వేడి జలుబు’ అంటారు.

సమ్మర్‌‌లో జలుబు చేస్తోందా? ఈ జాగ్రత్తలు మస్ట్!
X

సాధారణంగా జలుబు, దగ్గు వింటర్‌‌లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే సమ్మర్‌‌లో ఉండే అధిక వేడి, పొడి వాతావరణం వల్ల కూడా కొంతమందిలో జలుబు చేస్తుంటుంది. దీన్నే ‘సమ్మర్ కోల్డ్’ లేదా ‘వేడి జలుబు’ అంటారు.

సమ్మర్‌‌లో వేడి వాతావరణం వల్ల ఇమ్యూనిటీ తగ్గడం లేదా రైనో వైరస్, ఎంటిరోవైరస్‌ వంటివి సోకడం వల్ల ఈ సీజన్‌లో శ్వాసకోస సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో దీనికి చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..

ఈ సీజన్‌లో జలుబు చేసినప్పుడు నీటిని ఎక్కువగా తాగుతుండాలి. కూల్ వాటర్‌‌కు బదులు నార్మల్ వాటర్ తాగితే మంచిది. గొంతులో కఫం ఎక్కువగా ఉన్నవాళ్లు పొద్దున్నే గోరు వెచ్చటి నీటిలో అల్లం, మిరియాల వంటివి వేసుకుని కూడా తాగొచ్చు.

ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు విటమిన్– ‘ఎ’, ‘సి’లు తప్పక తీసుకోవాలి. ‘సి’విటమిన్ కోసం టొమాటో, నిమ్మకాయ, జామ వంటి పండ్లు తీసుకోవాలి. అలాగే విటమిన్–ఎ కోసం క్యారెట్లు, ఆకుకూరలు తీసుకోవచ్చు.

జలుబు వేధిస్తున్నవాళ్లు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి, చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు పొల్యూషన్ బారిన పడకుండా మాస్క్‌లు వాడాలి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు రుమాలుతో కవర్ చేసుకోవాలి. తాజా ఆహారమే తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కు పట్టేసినప్పుడు ఉపశమనం కోసం వేడి నీటి ఆవిరి పట్టొచ్చు.

ఇకపోతే నాలుగైదు రోజులకు మించి జలుబు, దగ్గు వేధిస్తుంటే తప్పక డాక్టర్‌ని కలవాలి. వైరస్‌ల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లకు డాక్టర్ల సూచన మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.

First Published:  28 April 2024 10:08 AM GMT
Next Story