Telugu Global
Health & Life Style

చలికాలంలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే..

చలికాలంలో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Sugar Control Tips in Telugu
X

చలికాలంలో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్‌లో షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవేంటంటే..

ఈ సీజన్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే డయాబెటిస్‌తో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. చలికాలంలో క్యారట్‌, బీట్‌రూట్‌, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకలీ, బఠానీలు, మొక్కజొన్న వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే విటమిన్లు, జింక్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్‌, అయొడిన్‌.. వంటి మినరల్స్ ఇన్సులిన్‌ స్థాయిని పెంచి డయాబెటిక్‌ రోగులకు మేలు చేస్తాయి.

చలికాలంలో సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు కూడా తింటుండాలి. నారింజ, నిమ్మ, యాపిల్, దానిమ్మ, కివీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిక్‌ రోగుల్లో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. అలాగే చలికాలంలో బెర్రీ పండ్లు సూపర్ ఫుడ్స్ గా పనిచేస్తాయి. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్ లెవల్స్, ఇన్సులిన్‌ స్థాయులు మెరుగుపడతాయి.

చలికాలంలో ప్రొటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. షుగర్ వల్ల కణజాలాలు దెబ్బతినకుండా మాంసం, చేపలు, పప్పులు, గుడ్లు వంటి ప్రొటీన్ ఫుడ్స్ తీసుకుంటుండాలి.

చలికాలంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే తెల్ల బియ్యం, దుంపలు, చక్కెర, బ్రెడ్, బిస్కెట్లు, కేక్స్ వంటివి తగ్గించాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలామంది వేడి వేడి టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే వాటిలో షుగర్ వేయకుండా చూసుకుంటే మంచిది. అలాగే రెగ్యులర్ టీకు బదులు హెర్బల్ టీలు తాగితే పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.

First Published:  3 Nov 2022 3:12 PM IST
Next Story