మన మహిళల నడుముకొలత పెరుగుతోంది
మనదేశంలో నలభైశాతం పైగా మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది.
మనదేశంలో నలభైశాతం పైగా మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - 5 గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
నడుము చుట్టు కొలతని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. 39-40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో ప్రతి పదిమందిలో ఐదుగురు లేదా ఆరుగురు అబ్డామినల్ ఒబేసిటీకి గురవుతున్నారని అధ్యయనంలో కనుగొన్నారు.
పెద్దవయసు, నగరాల్లో నివాసం, మాంసాహారం తినటం, డబ్బుని కలిగి ఉండటం... ఈ అంశాలన్నీ మహిళల నడుము చుట్టుకొలతని పెంచేస్తున్నాయని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు.
పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా ఉంటే దానిని అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒటేసిటీగా పిలుస్తారు. కొవ్వు శరీరంలో ఎక్కడ పేరుకుని ఉంది.... అనేదాన్ని బట్టి అది చేసే హాని ఆధారపడి ఉంటుంది.
కొవ్వు పొట్టవద్ద అధికంగా పేరుకుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ తరహా ఫ్యాట్ వలన అధిక రక్తపోటు, మధుమేహం, గుండెవ్యాధులు, స్ట్రోక్, గాల్ బ్లాడర్ వ్యాధులు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, శ్వాస సమస్యలు, డిప్రెషన్ వంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మన దేశీయుల్లో పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ తరహా అనారోగ్యాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆడవారిలో 80 సెంటీమీటర్లు, మగవారిలో 94 సెంటీమీటర్లకు మించి నడుము చుట్టుకొలత ఉంటే అబ్డామినల్ ఒబేసిటీగా పరిగణిస్తారు.
వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలలో సాధారణ ఒబేసిటీకంటే అబ్డామినల్ ఒబేసిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 15-19ఏళ్ల వయసులో 12.7శాతం మంది అమ్మాయిల్లో పొట్టవద్ద కొవ్వు సమస్య ఉండగా 40-49 మధ్య వయసులో ఉన్న స్త్రీలలో 56.7శాతం మంది ఈ సమస్యని కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి ఊబకాయ సమస్య పెరగటం మొదలైంది. 2016నాటికి ప్రపంచవ్యాప్తంగా 44శాతం మంది కంటే ఎక్కువగా పెద్దవయసువారు ఊబకాయంతో ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
అబ్డామినల్ ఒబేసిటీ ని ఇలా తగ్గించుకోండి...
♦ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరకంగా చురుగ్గా ఉండాలి. వ్యాయామం చాలా అవసరం. ఆయా సీజన్లలో లభించే పళ్లు కూరగాయలతో పాటు చిరు ధాన్యాలు, ముడిధాన్యాలు వంటివి ఎక్కువగా తినాలి. పాలిష్ చేసిన ధాన్యాలు, స్వీట్లు, బంగాళదుంపలు, చెక్కర పానీయాలు, ఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తినకూడదు.
♦ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడికారణంగా ఎక్కువ ఆహారం తీసుకునే వారు బరువు తగ్గాలని అనుకున్నా తగ్గలేరు.
♦ ఒత్తిడి దీర్ఘకాలం పాటు ఉంటే కార్టిసాల్ అనే హార్మోను ఎక్కువగా విడుదలయి ఆకలిని