Telugu Global
Health & Life Style

ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు

టాస్క్‌ ఫోర్స్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.. మంత్రి దామోదర ఆదేశం

ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు
X

ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టాస్క్‌ఫోర్స్‌ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్‌ సేఫ్టీపై శుక్రవారం సెక్రటేరియట్‌ లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫుడ్‌ సేఫ్టీ కోసం చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ, ప్రవేట్ హాస్టళ్లను నిరంతర పర్యవేక్షించాలని, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఫుడ్‌ సేఫ్టీపై కుక్‌లు, ఫుడ్‌ లాండర్స్‌ కు శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కృత్రిమ కొరత సృష్టించకుండా అన్నిచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్స్‌ లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఫుడ్‌ సేఫ్టీ, హెల్త్‌ అధికారులు క్రిస్టినా, ఆర్‌వీ కర్ణన్, హేమంత్ బోర్కడే, వాణీ, అజయ్ కుమార్, అమర్ సింగ్, శేషా శ్రీ, శివలీల తదితరులు పాల్గొన్నారు.

First Published:  22 Nov 2024 2:03 PM IST
Next Story