Telugu Global
Health & Life Style

మహిళల్లో విటమిన్ బి12 లోపం తెలిపే సంకేతాలివే

శరీరంలో విటమిన్ బి12 తక్కువ స్థాయిలో ఉంటే ముందుగా కనిపించే సాధారణ సంకేతం శక్తి లేకపోవటం. తగినంత నిద్ర, తిండి ఉన్నా నీరసంగా అనిపిస్తుంది.

మహిళల్లో విటమిన్ బి12 లోపం తెలిపే సంకేతాలివే
X

శరీరానికి అన్ని విటమిన్స్ సరైన మెుత్తంలో అందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నవిషయం మనకి తెలిసినదే. శరీరంలో ఉండే ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి. ఇది కండరాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. వీటితోపాటూ విటమిన్ B12 మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ఇది లోపిస్తే రక్త హీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్‌ వరకు మనల్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి12 లోపం శరీరంలో మార్పులు ఒక్కాసారిగా తెలియవు. నెమ్మదిగా కొన్ని లక్షణాలు తీవ్రం అవుతూ ఉంటాయి. అవేంటో చూద్దాం.

శరీరంలో విటమిన్ బి12 తక్కువ స్థాయిలో ఉంటే ముందుగా కనిపించే సాధారణ సంకేతం శక్తి లేకపోవటం. తగినంత నిద్ర, తిండి ఉన్నా నీరసంగా అనిపిస్తుంది. రెండవ విషయం చర్మం పాలిపోయినట్టుగా, పసుపు రంగులోకి మారుతుంది. ఇది విటమిన్ బి12 తగ్గినపుడు మాత్రమే కనిపించే లక్షణం. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లలో సూది గుర్చినట్టుగా నొప్పి, తిమ్మిరి ఉంటుంది. కణాలలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. అంతే కాదు రక్త కణాలకు తగినంత ఆక్సిజన్ లేని కారణంగా తలనొప్పి, తల తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. తేలిక పాటి వ్యాయామంతో, మెట్లు ఎక్కడం శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. గందరగోళం, మెదడు మొద్దుబారడం, మతిమరుపు , రోజువారి విషయాలు కూడా మరిచిపోతారు. ఈ విటమిన్ లోపంతో గ్లోసిటిన్, నోటి పూత ఉంటుంది. నొప్పి, వాపు వల్ల గొంతు ఎర్రగా మారుతుంది.

విటమిన్-బి12 లోపాన్ని పరిష్కరించడానికి మార్కెట్లో చాలా సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాతో వాటిని తీసుకోవచ్చు. ఇక సహజంగా విటమిన్ B12 పౌల్ట్రీ, గొర్రె మాంసం, చేపలు, పీత, పాలు, చీజ్, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులలో ఉంటుంది. శాకాహారులకు ఆహారంలో పెరుగు, వోట్మీల్, బీన్స్, బ్రోకలీ, బీట్‌రూట్, చిక్‌పీస్, బచ్చలికూర, దాదాపు అన్ని పండ్లలో ఈ విటమిన్‌ లభిస్తుంది.

First Published:  3 Jun 2024 12:30 AM GMT
Next Story