Telugu Global
Health & Life Style

డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకోవాలా? వద్దా?

పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతాయని గ్యాస్‌, అజీర్తి సమస్యలు రావంటున్న నిపుణులు

డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకోవాలా? వద్దా?
X

కొందరు డ్రైఫ్రూట్స్‌ను రాత్రంతా నానబెట్టి తీసుకోవాలని అంటారు. మరికొందరేమో నానబెట్టకుండానే తినమంటారు. అసలు ఎలా తింటే లాభమో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుంది. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతాయి. గ్యాస్‌, అజీర్తి సమస్యలు రావు.

రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటితో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కూడా తగుతుంది. సాధారణ గింజల కంటే నానబెట్టిన గింజల్లో కేలరీల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రెండింటిలోనూ పోషకాలు సమానంగానే ఉన్నా.. నానబెట్టిన గింజల్లో లాభం కాస్త ఎక్కువగానే ఉంటుంది. నీళ్లను పీల్చుకున్న గింజల్లో రుచి ఎక్కువగానే ఉంటుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్‌, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు.

First Published:  12 Dec 2024 4:15 PM IST
Next Story