Telugu Global
Health & Life Style

లైఫ్‌ సైన్సెస్‌ లో పది నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం

మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు

లైఫ్‌ సైన్సెస్‌ లో పది నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం
X

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పది నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని, మొత్తం 140 ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌ గా హైదరాబాద్‌ మారిపోయిందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనతో 51 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలసీలను కొనసాగిస్తూ ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జీనోమ్‌ వ్యాలీ థర్డ్‌ ఫేజ్‌ లో భాగంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబుడులు వస్తాయన్నారు. యరోపియన్‌ సంస్థ క్రికా రూ.2 వేల కోట్లతో ప్లాంట్‌ నెలకొల్పబోతుందని తెలిపారు. జీనోమ్‌ వ్యాలీ ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు తయారు చేస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆమ్‌జెన్‌ హైదరాబాద్‌ లో తమ సంస్థను స్థాపించబోతుందని తెలిపారు.

First Published:  14 Nov 2024 4:58 PM IST
Next Story