Telugu Global
Health & Life Style

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గుర్తున్నాయా?

కొత్త ఏడాదిలో ఆవేశంగా రిజల్యూషన్స్ తీసుకున్నవాళ్ళు చాలామందే ఉంటారు. అయితే కొన్నిరోజులకి.. ‘ఇవన్నీ మనతో అయ్యేలా లేవే ’ అంటూ నిరుత్సాహపడి రిజల్యూషన్‌ని గాలికొదిలేస్తుంటారు.

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గుర్తున్నాయా?
X

కొత్త ఏడాదిలో ఆవేశంగా రిజల్యూషన్స్ తీసుకున్నవాళ్ళు చాలామందే ఉంటారు. అయితే కొన్నిరోజులకి.. ‘ఇవన్నీ మనతో అయ్యేలా లేవే ’ అంటూ నిరుత్సాహపడి రిజల్యూషన్‌ని గాలికొదిలేస్తుంటారు. సరిగ్గా ఇలాంటప్పుడే కాస్త గట్టిగా నిలబడాలంటున్నారు సైకాలజిస్టులు. ఇందుకోసం కొన్ని ఫార్ములాస్ ఫాలో అవ్వొచ్చు.

ఉత్సాహం కొద్దీ కొన్ని గోల్స్ పెట్టుకుని తర్వాత వాటికోసం కష్టపడలేక వదిలేస్తుంటారు చాలామంది. ఒక్కోసారి పెట్టుకున్న గోల్స్ చాలా పెద్దవనింపించొచ్చు. అలాంటప్పుడు స్మార్ట్(S.M.A.R.T) పద్ధతిని అమలు చేయాలంటున్నారు నిపుణులు. స్మార్ట్ అంటే.. స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైమ్‌లీ.. అన్నమాట. ఇదెలా ఉంటుందంటే..

స్మార్ట్ విధానంలో రిజల్యూషన్ పట్ల స్పష్టమైన అవగాహనతో కొద్దికొద్దిగా అమలుచేస్తూ ముందుకెళ్లాలి. లక్ష్యాన్ని పూర్తిగా వదలిపెట్టకుండా మీకు వీలున్నవిధంగా మార్పులు చేసుకోవచ్చు. అలాగే మీలో వస్తున్న మార్పుని మీరే ప్రశంసించుకుంటూ మోటివేటెడ్‌గా ఉండాలి.

నో ఎక్స్‌క్యూజెస్

పెట్టుకున్న గోల్స్‌కు మినహాయింపులు ఇవ్వడం మొదలైతే మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒక కారణంతో కొత్త అలవాటుని మానేస్తే.. క్రమంగా అదే అలవాటు అవుతుంది. ఏడాదికి ఒకట్రెండు మినహాయింపులు పర్వాలేదు కానీ, మినహాయింపులే అలవాటుగా మారకూడదు. ‘ఇవాళ చాలా చలిగా ఉంది. రేపు వెళ్దాం’ అని జిమ్‌కి వెళ్లడానికి బద్ధకిస్తే.. మెల్లమెల్లగా అదే అలవాటైపోతుంది. కాబట్టి మినహాయింపులొద్దు.

ట్రాక్ యువర్ సక్సెస్

రిజల్యూషన్స్ అమలు చేసే సమయంలో మీలో కలిగే చిన్నచిన్న మార్పుల్ని గమనిస్తుండాలి. అది ఎంత చిన్న మార్పు అయినా పరవాలేదు. దాన్నే సక్సెస్‌గా భావించి వీలునుబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. అనుకున్న మార్గంలో మరింత ముందుకు వెళ్లడానికి తగిన కాన్ఫిడెన్స్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

మార్పులు ఓకే

ఒకవేళ అనుకున్న ట్రాక్‌లో నడవడం లేదన్న అనుమానం కలిగినా, ఆశించిన ఫలితం దక్కదన్న సంకేతాలు కనిపించినా.. నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు ఈ యాంటీ క్లైమాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అసలీ రిజల్యూషన్ నేనెందుకు పూర్తి చేయాలనుకుంటున్నాను? నేను ఆశించిన లక్ష్యం ఏమిటి..? అనే ప్రశ్న ఎవరికివాళ్లు వేసుకోవాలి. అవసరమైతే మీకు తగ్గట్టు గోల్ సైజు తగ్గించుకోవడం కూడా ఓ తెలివైన పనే.

ఇలా ఎప్పటికప్పుడు మోటివేటెడ్ గా ఉంటూ ముందుకెళ్తుంటే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదు.

First Published:  9 Jan 2024 3:30 PM IST
Next Story