Telugu Global
Health & Life Style

పర్పుల్ డైట్ గురించి తెలుసా?

ఫుడ్ ట్రెండ్స్‌లో రకరకాల డైట్‌ల గురించి వింటూ ఉంటాం. ఒక్కో డైట్‌కు ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే డైట్స్‌లో.. ‘పర్పుల్ డైట్’ అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తుంది.

పర్పుల్ డైట్ గురించి తెలుసా?
X

పర్పుల్ డైట్ గురించి తెలుసా?

ఫుడ్ ట్రెండ్స్‌లో రకరకాల డైట్‌ల గురించి వింటూ ఉంటాం. ఒక్కో డైట్‌కు ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే డైట్స్‌లో.. ‘పర్పుల్ డైట్’ అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇదెలా ఉంటుందంటే.

నీలి రంగు లేదా ఊదా రంగులో ఉన్న ఆహారాలను తీసుకోవడమే పర్పుల్ డైట్. సాధారణంగా పండ్లు, కాయగూరల రంగుని బట్టి వాటిలోని గుణాలు మారుతుంటాయి. ఉదాహరణకు తెలుపు రంగు ఆహారాల్లో కాల్షియం, ఆకుపచ్చ రంగు ఆహారాల్లో విటమిన్స్, ఎరుపు రంగు పండ్లలో ఐరన్.. ఇలా కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. అలా నీలి రంగులో ఉండే ఆహారాల్లో ‘ఆంథోసైనిన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు.

నీలి రంగు ఆహారాలు ముఖ్యంగా గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. తద్వారా కార్డియో వాస్కులర్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, ఊదారంగు ఆహారాలు మెదడు సామర్ధ్యాన్ని పెంపొందించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి కూడా తోడ్పడతాయి. శరీరంలో క్యాన్సర్ సెల్స్‌ను నివారించడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అవసరమయ్యే ఎన్నోరకాల న్యూట్రియెంట్స్ ఊదా రంగు ఆహారాల్లో ఉంటాయి.

పర్పుల్ డైట్‌లో బ్లూబెర్రీస్‌, నల్ల ద్రాక్ష, వంకాయ, రెడ్ క్యాబేజ్, పర్పుల్ పొటాటో, బ్లాక్ బెర్రీస్, పర్పుల్ క్యాలీ ఫ్లవర్, అంజీర్ పండ్లు, స్వీట్ పొటాటో వంటివి ముఖ్యమైన ఆహారాలు. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.. శరీరంలో మంట, వాపులను తగ్గిస్తాయి.

పర్పుల్ డైట్ పాటించడం అంటే కేవలం ఊదారంగు ఆహారాలు మాత్రమే తినాలని కాదు, డైట్‌లో ఊదారంగు ఆహారాలు కూడా ఉండేలా చూసుకోవడమే ఈ డైట్ ఉద్దేశం. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు డైట్‌లో పర్పుల్ రంగు ఆహారాలను చేర్చుకుంటే మంచిది.

First Published:  27 Oct 2023 11:15 AM IST
Next Story