Telugu Global
Health & Life Style

న్యూమోనియా పంజా..నిలోఫర్‌ ఆస్పత్రిలో 200 కేసులు నమోదు

0-5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం . అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

న్యూమోనియా పంజా..నిలోఫర్‌ ఆస్పత్రిలో 200 కేసులు నమోదు
X

రాష్ట్రవ్యాప్తంగా చలి పెరగడంతో పిల్లలపై న్యూమోనియా పంజా విసురుతున్నది. నిలోఫర్‌ ఆస్పత్రిలో ఇప్పటికే 200 వరకు న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. రోజూ ఓపీకి 30-40 మంది వస్తుండగా.. సోమ నుంచి బుధవారం వరకు ఈ సంఖ్య 60 వరకు చేరిందంటున్నారు. వీరిలో కొందరికి హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ, వెంటిలేటర్‌ చికిత్సలూ అవసరమౌతున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్‌ శిలీంధ్రాల వల్ల వ్యాప్తి చెందుతుంది. 0-5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. స్ట్రెప్టోకోకస్‌, రెస్పిరేటరీ సిన్సిటియర్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి), ఇన్‌ఫ్యూయింజా వైరస్‌ న్యూమోనియాలకు ఎక్కువశాతం మంది గురవుతున్నారు.

చలికాలంలో చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిలోఫర్‌ ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఉషారాణి సూచించారు. న్యూమోనియా, ఆస్తమా, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు తప్పకుండా తాగించాలి. దీనివల్ల న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లను నిరోధించవచ్చని తెలిపారు. తీవ్ర జ్వరం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

First Published:  30 Nov 2024 8:09 AM IST
Next Story