Telugu Global
Health & Life Style

పీసీఓఎస్ సమస్య ఉంటే.. డైట్ ఇలా..

పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనేది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉంటున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడంలో డైట్‌దే కీలక పాత్ర అని డాక్టర్లు చెప్తున్నారు.

పీసీఓఎస్ సమస్య ఉంటే.. డైట్ ఇలా..
X

పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనేది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉంటున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడంలో డైట్‌దే కీలక పాత్ర అని డాక్టర్లు చెప్తున్నారు. పీసీఓఎస్ డైట్ ఎలా ఉండాలంటే..

పీసీఓఎస్ అనేది హార్మోన్ల ఇంబాలెన్స్ లేదా జన్యు పరమైన కారణాల వచ్చే రుగ్మత. దీనివల్ల మహిళల్లో అండోత్పత్తి సరిగా జరగదు. దీనివల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు, డయాబెటిస్ రిస్క్, బరువు పెరగడం, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అయితే దీన్ని డైట్ ద్వారా కొంతవరకూ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

పీసీఓఎస్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జంక్ ఫుడ్‌ను మానేయాలి. అలాగే హార్మోన్ల పనితీరుని మెరుగు పరిచేందుకు డైట్‌లో ‘బి’ విటమిన్, హెల్దీ ఫ్యాట్స్ తప్పక ఉండేలా చూసుకోవాలి.

పీసీఓఎస్ ఉన్నవాళ్లు విటమిన్–బి ఎక్కువగా ఉండే గోధుమలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవాలి. పీసీఓఎస్ వల్ల వచ్చే డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించేందుకు తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉండే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. కాయగూరలు, పండ్లు, పప్పు దినుసుల వంటివి తీసుకోవాలి.

హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కొవ్వులదే కీ రోల్. కాబట్టి హెల్దీ ఫ్యా్ట్స్‌ను తప్పక తీసుకోవాలి. వీటికోసం చేపలు, బాదం, పిస్తా, వేరుశేనగలు, వాల్నట్స్, కొబ్బరి, పెరుగు, నెయ్యి, ఆవకాడో వంటివి తీసుకుంటుండాలి.

పీసీఓఎస్ ఉన్నవాళ్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను కంట్రోల్ చేయడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలు తప్పక తీసుకోవాలి. బెర్రీ జాతి పండ్లు, గ్రీన్ టీ, ఆకుకూరలు, హెర్బల్ టీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇకపోతే పీసీఓఎస్‌ను అదుపులో ఉంచడానికి యాక్టివ్ లైఫ్‌స్టై్ల్ కూడా ముఖ్యమే. వ్యాయామం తప్పక చేస్తుండాలి. వాటిటోపాటు ఆటలు నచ్చిన పనులతో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. హాయిగా నిద్ర పోవాలి. అప్పుడే హార్మోన్లు సరిగ్గా పనిచేస్తూ సమస్య అదుపులోకి వస్తుంది.

First Published:  13 May 2024 6:00 PM IST
Next Story